అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై ఆశలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు లాభపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 246 పాయింట్లు లాభపడి 38 వేల 127 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 70 పాయింట్లు వృద్ధి చెంది 11 వేల 305 వద్ద స్థిరపడింది.
లాభాల్లో
సెన్సెక్స్ ప్యాక్‌లో ఇన్ఫోసిస్ 4.19 శాతం మేర లాభపడింది. సిప్లా, వేదాంత, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, హెచ్‌యూఎల్ టెక్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్ (3.96 శాతం) రాణించాయి.
నష్టాల్లో
ఎస్ బ్యాంకు, ఐఓసీ, గెయిల్, ఎమ్ అండ్ ఎమ్, జీ ఎంటర్టైన్మెంట్, రిలయన్స్, టీసీఎస్, హీరో మోటోకార్ప్, ఆర్ఐఎల్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఎన్టీపీసీ (3.30 శాతం) నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు
డొనాల్డ్ ట్రంప్.. అమెరికా-చైనాతో వాణిజ్య చర్చల అంశంపై సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నిక్కీ, హాంగ్ సెంగ్, కోస్పీ, షాంగై కాంపోజిట్ లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లూ లాభాలతో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ
ఇంట్రాడేలో రూపాయి విలువ స్వల్పంగా పెరిగి ఒక డాలరుకు రూ.71.03గా ఉంది.
ముడిచమురు
సౌదీఅరేబియా వద్ద ఇరానియన్ ట్యాంకర్‌పై క్షిపణి దాడులు జరిగాయన్న వార్తల నేపథ్యంలో ముడిచమురు ధర 1.79 శాతం మేర పెరిగిపోయింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 60.16 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: పండుగ సీజన్లోనూ మారని 'ఆటో' గేర్