మూడో రోజూ అదే జోష్..
స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 606 పాయింట్లు బలపడి 32,720 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 172 పాయింట్లు పెరిగి 9,553 వద్దకు చేరింది.
ఆరంభంలోనే సానుకూలంగా స్పందించిన సూచీలు చివరి వరకు అదే జోరు కొనసాగించాయి. స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగియడం వరుసగా ఇది మూడో రోజు.
30 షేర్ల ఇండెక్స్‌లో హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌సీఎల్‌టెక్, ఎం&ఎం, టాటా స్టీల్, ఎస్బీఐ షేర్లు భారీగా లాభపడ్డాయి.
యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, టైటాన్, నెస్లే షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.