స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు నేడు బ్రేక్ పడింది. కరోనా వైరస్ భయాలతో పాటు ఇటీవలి లాభాలను మదుపరులు సొమ్ముచేసుకునే పనిలో పడటం నేటి నష్టాలకు ప్రధాన కారణం. హెవీ వెయిట్ షేర్లు చాలా వరకు అమ్మకాల ఒత్తిడికి లోనవడం నేటి నష్టాలకు మరో కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 164 పాయింట్ల క్షీణతతో 41,142 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి.. 12,086 వద్ద ముగిసింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 41,394 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,073 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,155 పాయింట్ల అత్యధిక స్థాయి, 12,074 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివివే..
ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, హెచ్‌సీఎల్‌టెక్, యాక్సిస్ బ్యాంక్, హీరోమోటార్స్ లాభాలతో ముగిశాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం&ఎం, రిలయన్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్ నష్టాలను నమోదు చేశాయి.
ఇదీ చూడండి: వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ.. మరింత చౌకగా రుణాలు