ETV Bharat / business

బ్యాంకింగ్, ఆటో షేర్ల జోరు- సెన్సెక్స్​ 629 ప్లస్ - స్టాక్ మార్కెట్ వార్తలు తెలుగు

బ్యాంకింగ్, ఆటో షేర్ల జోరుతో స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 629 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 169 పాయింట్లు పుంజుకుని 11 వేల 400 పైకి చేరింది.

SHARE MARKETS TODAY
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Oct 1, 2020, 3:52 PM IST

స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 629 పాయింట్లు పుంజుకుని.. 38,697 వద్దకు చేరింది. ఎన్​​ఎస్​ఈ-నిఫ్టీ 169 పాయింట్ల లాభంతో 11,417 వద్ద సెషన్​ను ముగించింది.

కేంద్రం విడుదల చేసిన అన్​లాక్-5 మార్గదర్శకాల్లో మరిన్ని వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులు లభించాయి. ఈ సానుకూలతలతో మదుపరులు భారీగా కొనుగోళ్లకు దిగటం లాభాలకు కారణంగా తెలుస్తోంది. బ్యాంకింగ్, ఆటో, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.

సెప్టెంబర్​లో వాహన రంగం సానుకూలంగా వృద్ధి నమోదు చేయడం వల్ల ఆటో షేర్లు భారీగా పుంజుకున్నాయి. అక్టోబర్ 15 నుంచి సినిమా హాళ్లు తెరిచేందుకు అనుమతులు లభించిన నేపథ్యంలో పీవీఆర్, ఐనాక్స్ షేర్లు కూడా గురువారం భారీగా లాభపడ్డాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 38,739 పాయింట్ల అత్యధిక స్థాయి, 38,410(సెషన్ ప్రారంభ స్థాయి) పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,426 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,347 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఇండస్​ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఓఎన్​జీసీ, ఐటీసీ, ఎన్​టీపీసీ, టైటాన్, రిలయన్స్ షేర్లు స్వల్పంగా నష్టాలను నమోదు చేశాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన టోక్యో సూచీ గురువారం స్వల్పంగా నష్టపోయింది. షాంఘై, సియోల్, హాంకాంగ్ సూచీలు సెలవులో ఉన్నాయి.

రూపాయి, ముడి చమురు

కరెన్సీ మార్కెట్​లో రూపాయి గురువారం భారీగా 63 పైసలు పెరిగింది. దీనితో డాలర్​తో పోలిస్తే మారకం విలువ 73.13 వద్దకు చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.38 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 42.14 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:డెబిట్‌, క్రెడిట్‌ కార్డు లావాదేవీలకు అదనపు భద్రత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.