స్టాక్ మార్కెట్లు శుక్రవారం సెషన్లో లాభాలతో ముగిశాయి. హెవీ వెయిట్ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.
బొంబయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 306 పాయింట్లు పుంజుకుని 34,287 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 113 పాయింట్ల వృద్ధితో 10,142 వద్దకు చేరింది.
మిడ్ సెషన్ వరకు కాస్త ఉగిసలాటలో కొనసాగినా.. ఆ తర్వాత లాభాల్లో స్థిరంగా కొనసాగాయి సూచీలు. గురువారం మినహా సూచీలు ఈ వారమంతా లాభాలను నమోదు చేయడం గమనార్హం.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 34,405 పాయింట్ల అత్యధిక స్థాయి, 33,958 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 10,178 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 10,041 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభ, నష్టాల్లోనివి ఇవే..
గడిచిన ఆర్థిక సంవత్సరం (2019-20) చివరి త్రైమసికంలో ఎస్బీఐ లాభాలు నాలుగు రెట్లు పెరిగినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ షేర్లు దాదాపు 8 శాాతం పుంజుకున్నాయి. టాటా స్టీల్, బజాజ్ ఫినాన్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్&టీ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
టీసీఎస్, హెచ్‌యూఎల్, బజాజ్ ఆటో, నెస్లే, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
రూపాయి..
కరెన్సీ మార్కెట్లో రూపాయి స్వల్పంగా ఒక పైసా నష్టపోయింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ రూ.75.58 వద్ద స్థిరపడింది.
ఇదీ చూడండి:ఇప్పట్లో ప్రభుత్వం నుంచి కొత్త పథకాలు ఉండవు!