15 వేలకు చేరువైన నిఫ్టీ..
స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెషన్ పొడిగింపు సూచీల్లో కొత్త ఉత్సాహం నింపింది. సెన్సెక్స్ 1030 పాయింట్లు పెరిగి 50,782 వద్ద ముగిసింది. నిఫ్టీ 274 పాయింట్ల లాభంతో 14,982 వద్ద స్థిరపడింది.
బ్యాంకింగ్ షేర్ల దూకుడు లాభాలకు ప్రధాన కారణం.
- యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫినాన్స్, ఎస్బీఐ లాభాలను గడించాయి.
- డాక్టర్ రెడ్డీస్, పవర్‌గ్రిడ్, టీసీఎస్, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, మారుతీ షేర్లు నష్టపోయాయి.