ETV Bharat / business

8వ రోజూ లాభాల పరంపర- నిఫ్టీ@11,931

స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 54 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ స్వల్పంగా 17 పాయింట్లు పుంజుకుంది. ఐటీ, హెవీ వెయిట్ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.

share market news
స్టాక్ మార్కెట్ వార్తలు
author img

By

Published : Oct 12, 2020, 3:52 PM IST

వరుసగా ఎనిమిదో రోజూ స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగింది. సోమవారం సెషన్​లో బీఎస్ఈ-సెన్సెక్స్ స్వల్పంగా 84 పాయింట్లు పుంజుకుని.. 40,594 వద్దకు చేరింది. ఎన్​​ఎస్​ఈ-నిఫ్టీ 17 పాయింట్ల స్వల్ప లాభంతో 11,931 వద్ద స్థిరపడింది.

ఆసియా మార్కెట్ల సానుకూలతలకు తోడు.. ఐటీ సహా హెవీ వెయిట్ షేర్లు సోమవారం లాభాలకు దన్నుగా నిలిచాయి.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 40,905 పాయింట్ల అత్యధిక స్థాయి, 40,387 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 12,022 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,867 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఇన్ఫోసిస్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్​సీఎల్​టెక్, మారుతీ, పవర్​గ్రిడ్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

భారతీ ఎయిర్​టెల్, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు నష్టాలతో ముగిశాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్, కోస్పీ సూచీలు లాభాలను గడించాయి. టోక్యో సూచీ నష్టాలతో ముగిసింది.

రూపాయి, ముడి చమురు

కరెన్సీ మార్కెట్​లో రూపాయి 12 పైసలు తగ్గింది. దీనితో డాలర్​తో పోలిస్తే మారకం విలువ 73.28 వద్దకు చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 1.52 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 42.17 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:ఉద్యోగులకు ఎల్​టీసీ క్యాష్​ ఓచర్లు, ఫెస్టివల్ అడ్వాన్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.