వారాంతపు సెషన్లో స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా(దాదాపు ఫ్లాట్‌గా) ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ స్వల్పంగా 13 పాయింట్ల లాభంతో 51,544 (కొత్త రికార్డ్) వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 15,163 వద్ద ముగిసింది.
బ్యాంకింగ్, ఐటీ షేర్లు లాభాలను గడించగా.. ఎఫ్ఎంసీజీ, లోహ షేర్లు డీలా పడ్డాయి.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 51,804 పాయింట్ల అత్యధిక స్థాయి: 51,260 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,243 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,081 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డ్ఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ లాభాలను గడించాయి.
ఐటీసీ, ఓఎన్జీసీ, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్టెల్, టైటాన్, మారుతీ షేర్లు నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో టోక్యో సూచీ శుక్రవారం నష్టాలను నమోదు చేసింది. షాంఘై, కోస్పీ, హాంగ్‌సెంగ్ మార్కెట్లకు సెలవు.
ఇదీ చదవండి:డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. జాగ్రత్త!