ETV Bharat / business

ఐటీ, బ్యాంకింగ్​ రంగాల ఊతంతో మార్కెట్ల జోరు - nifty

గత సెషన్​లో భారీ లాభాలు నమోదు చేసిన సూచీలు ఇవాళా సానుకూలంగానే ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్​ 200 పాయింట్లకు పైగా పెరిగింది. ప్రస్తుతం 167 పాయింట్ల లాభంతో 41 వేల 619 వద్ద ఉంది. ఐటీ, బ్యాంకింగ్​ రంగాలు జోరుమీదున్నాయి.

sensex-jumps-195-dot-25-pts-to-41647-dot-60-in-early-trade-nifty-rises-56-dot-65-pts-to-12272-dot-55
ఐటీ, బ్యాంకింగ్​ రంగాల ఊతంతో మార్కెట్ల జోరు
author img

By

Published : Jan 10, 2020, 10:02 AM IST

స్టాక్​మార్కెట్లు మంచి లాభాల్లో ట్రేడవుతున్నాయి. క్రితం సెషన్​లో భారీ లాభాలతో ముగిసిన సూచీలు ఇవాళ్టి ట్రేడింగ్​లోనూ సానుకూల ఫలితాలను నమోదు చేస్తున్నాయి. అమెరికా-ఇరాన్​ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండడంతో మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయని వాణిజ్య విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చైనాతో మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై జనవరి 15న అమెరికా సంతకం చేయనుందన్న సంకేతాలూ మార్కెట్ల జోరుకు ఓ కారణం.

బొంబాయి స్టాక్​ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఆరంభ ట్రేడింగ్​లో​ 200 పాయింట్లకు పైగా పెరిగింది. ప్రస్తుతం 167 పాయింట్ల లాభంతో 41 వేల 619 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 12 వేల 263 వద్ద ఉంది.

ఐటీ, ఆటో, ఫార్మా, లోహ, బ్యాంకింగ్​ రంగాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి.

లాభనష్టాల్లోనివివే...

సెన్సెక్స్​ ప్యాక్​లో 1.35 శాతం పెరిగిన కోటక్​ బ్యాంకు ఉత్తమ గెయినర్​గా ఉంది. టెక్​ మహీంద్రా, ఇన్ఫోసిస్​, ఎల్​ అండ్​ టీ, హీరో మోటోకార్ప్​, భారతీ ఎయిర్​టెల్​, కోటక్​ మహీంద్రా బ్యాంక్​, టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, హెచ్​సీఎల్​ టెక్​లు రాణిస్తున్నాయి.

పవర్​గ్రిడ్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్​, నెస్లే ఇండియా, ఏసియన్​ పెయింట్స్​ డీలాపడ్డాయి.

రూపాయి..

ఆరంభ ట్రేడింగ్​లో రూపాయి స్వల్పంగా 8 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే మారకం విలువ 71.13గా ఉంది.

Intro:Body:

https://www.aninews.in/news/national/general-news/chandrababu-naidu-seeks-peoples-support-to-protest-against-3-capital-proposal-by-andhra-govt20200110084402/

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.