ఊగిసలాట ధోరణి..
స్టాక్ మార్కెట్లు లాభా నష్టాల మధ్య ఊగిసలాటలో కొనసాగుతున్నయి. అరంభంలో స్వల్ప లాభాలు నమోదు చేసిన సూచీలు.. కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 40 పాయింట్లకుపైగా కోల్పోయి 38,404 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా తగ్గి.. 11,479 వద్ద కొనసాగుతోంది.
ఐటీ మినహా మిగతా ఆన్ని రంగాలు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. సెప్టెంబర్ డెరివేటివ్స్ గడువు దగ్గరపడుతుండటం, ఆర్థిక వృద్ధిపై ప్రతికూల అంచనాలు ఒడుదొడుకులకు కారణంగా తెలుస్తోంది. మార్కెట్లను ప్రభావితం చేసే దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు లేకపోవడం కూడా మార్కెట్ల స్పందనకు కారణంగా తెలుస్తోంది.
- హెచ్‌సీఎల్‌టెక్, కోటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
- భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఆటో, నెస్లే, పవర్‌గ్రిడ్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
అసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన షాంఘై, సియోల్, హంకాంక్ సూచీలూ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.16 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 43.22 వద్ద ఉంది.