స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలతో ముగిశాయి. బేర్ దెబ్బకు గురువారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 379 పాయింట్లు తగ్గి 51,324 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 90 పాయింట్ల నష్టంతో 15,118 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు నష్టాలకు కారణంగా తెలుస్తోంది. ప్రైవేటు రంగ ఆర్థిక సంస్థలు, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడం కూడా నష్టాలకు మరో కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 51,903 పాయింట్ల అత్యధిక స్థాయి, 51,186 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,250 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,078 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
బజాజ్ ఫినాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎం&ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై సూచీ మాత్రమే లాభాలను గడించింది. టోక్యో, కోస్పీ, హాంకాంగ్ నష్టాలను నమోదు చేశాయి.
ఇదీ చదవండి:ఆండ్రాయిడ్ 12 ఫీచర్లు లీక్- కొత్త అప్డేట్స్ ఇవే!