ETV Bharat / business

నిర్మలమ్మ ప్రకటనతో మార్కెట్ల జోరు-సెన్సెక్స్ 693 పాయింట్లు వృద్ధి

కరోనా భయాలు కొనసాగుతున్నా.. స్టాక్ మార్కెట్లు నేడు లాభాలను నమోదు చేశాయి. వరుస నష్టాలకు బ్రేక్​ చెబుతూ సెన్సెక్స్ 693 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ 191 పాయింట్లు బలపడింది.

STOCKS TODAY
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Mar 24, 2020, 3:57 PM IST

స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు నేడు బ్రేక్​ పడింది. కరోనా నేపథ్యంలో తలెత్తిన సంక్షోభాన్ని తట్టుకునేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు పలు ఉద్దీపనలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ బలపడి కొనుగోళ్లపై దృష్టి సారించారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 693 పాయింట్లు బలపడి.. 26,674 వద్దకు చేరింది. ఇంట్రాడేలో ఈ సూచీ 27,463 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 25,639 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 191 పాయింట్ల వృద్ధితో 7,801కి చేరింది. ఇంట్రాడేలో ఈ సూచీ 8,037 పాయింట్లు గరిష్ఠాన్ని, 7,511 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఇన్ఫోసిస్​, బజాజ్ ఫినాన్స్, మారుతీ, హెచ్​యూఎల్​, హెచ్​సీఎల్​ టెక్​, రిలయన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఎం&ఎం, ఇండస్​ ఇండ్ బ్యాంక్​, ఐటీసీ, పవర్​గ్రిడ్​, ఎల్​&టీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి:ఉచితంగా జియో బ్రాడ్​బ్యాండ్ సేవలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.