ETV Bharat / business

కరోనా క్రాష్​: ఒక్కరోజే రూ. 5 లక్షల కోట్లు హాంఫట్​ - సెన్సెక్స్ టుడే

అంతర్జాతీయ, దేశీయ స్టాక్ మార్కెట్లు కరోనా భయాలతో కుదేలవుతున్నాయి. సెన్సెక్స్​ 1,089 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టీ 328 పాయింట్లకుపైగా క్షీణతతో కొనసాగుతోంది. భారీ నష్టాలకు మదుపరుల సంపద రూ.5 లక్షల కోట్లు ఆవిరైంది.

Sensex crashes over 1,100 pts
కరోనా కల్లోలం స్టాక్​ మార్కెట్లు కుదేలు
author img

By

Published : Feb 28, 2020, 10:54 AM IST

Updated : Mar 2, 2020, 8:24 PM IST

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చైనా తర్వాత పలు ఇతర దేశాలకు కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఆ ప్రభావంతో ఐదు నెలల కనిష్ఠానికి పడిపోయాయి దేశీయ సూచీలు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ 1,089 పాయింట్లకు పైగా నష్టపోయింది. ప్రస్తుతం 38,655 వద్దకు చేరింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 328 పాయింట్లకు పైగా క్షీణతతో 11,304 వద్ద కొనసాగుతోంది.

రూ.5 లక్షల కోట్లు ఆవిరి..

బీఎస్​ఈ మదుపరుల సంపద రూ.4,65,915.58 కోట్లు ఆవిరైంది. ఫలింతంగా మదుపరుల మొత్తం సంపద రూ.1,47,74,108.50 కోట్లకు తగ్గింది.

లాభనష్టాల్లోనివివే..

30 షేర్ల ఇండెక్స్​లో ఎన్​టీపీసీ మినహా మిగతా అన్ని కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.

టాటా స్టీల్​, బజాజ్​ ఫినాన్స్, టెక్​ మహీంద్రా, ఇన్ఫోసిస్​, ఎం&ఎం షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

రూపాయి, ముడి చమురు

రూపాయి నేడు 28 పైసలు తగ్గి.. డాలర్​తో మారకం విలువ 71.89 వద్ద కొనసాగుతోంది.

ముడి చుమురు ధరల సూచీ- బ్రెంట్​ 2.47 శాతం తగ్గి.. బ్యారెల్​ ముడి చమురు ధర 50.45 డాలర్లుగా ఉంది.

ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు.. షాంఘై, హాంకాంగ్, సియోల్​, టోక్యో సూచీలూ ప్రారంభ సెషన్​లో 4 శాతం మేర నష్టాన్ని నమోదు చేశాయి.

ఇదీ చూడండి:అయ్యో పాపం కోడి... అంతా 'కరోనా' వల్లే!

Last Updated : Mar 2, 2020, 8:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.