వారాంతపు సెషన్లో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 441 పాయింట్ల నష్టంతో 50,405 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 143 పాయింట్లు కోల్పోయి 14,938 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు, ఆర్థిక, ఔషధ రంగాల్లో వెల్లువెత్తిన అమ్మకాలు నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 50,886 పాయింట్ల అత్యధిక స్థాయి: 50,160 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,092 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,862 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఓఎన్జీసీ, మారుతీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌యూఎల్ షేర్లు లాభాలను గడించాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, నిక్కీ, కోస్పీ, హాంగ్‌సెంగ్ భారీగా నష్టపోయాయి.
ఇదీ చదవండి:ఆదాయ పన్ను విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి