ETV Bharat / business

సంవత్సరాంతంలో కుదేలు.. సెన్సెక్స్ 304 పాయింట్లు పతనం

author img

By

Published : Dec 31, 2019, 6:24 PM IST

Updated : Dec 31, 2019, 9:22 PM IST

సవంత్సరాంతంలో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. నష్టాలతోనే సెషన్​ ప్రారంభించిన సెన్సెక్స్.. చివరకు 304 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 87 పాయింట్లు పతనమైంది. టెక్​ మహీంద్రా నేడు అత్యధిక నష్టాన్ని మూటగట్టుకుంది.

Sensex 304 points fall at year end
సంవత్సరాంతంలో కుదేలు.. సెన్సెక్స్ 304 పాయింట్లు పతనం

2019 చివరి సెషన్​లో స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ప్రారంభం నుంచే ఒడుదొడుకుల్లో కొనసాగిన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. దాదాపు అన్ని రంగాలు నేడు నష్టాలను చవి చూడగా.. ఐటీ, వాహన, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 304 పాయింట్లు క్షీణించింది. చివరకు 41,254 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 87 పాయింట్ల నష్టంతో 12,168 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 41,607 (నేటి సెషన్​ ప్రారంభమైన స్థాయి) పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,185 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,247 పాయింట్ల అత్యధిక స్థాయి.. 12,151 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎన్​టీపీసీ 2.01 శాతం, సన్​ఫార్మా 0.62 శాతం, ఓఎన్​జీసీ 0.55 శాతం, పవర్​ గ్రిడ్ 0.29 శాతం, ఆల్ట్రాటెక్​ సిమెంట్ 0.11 శాతం లాభాలను నమోదు చేశాయి. 30 షేర్ల ఇండెక్స్​లో ఈ ఐదు షేర్లు మాత్రమే లాభాలను గడించాయి.

టెక్​ మహీంద్రా 2.51 శాతం, బజాజ్ ఆటో 2.16 శాతం, రిలయన్స్ 1.95 శాతం, హీరో మోటార్స్ 1.41 శాతం, ఇండస్​ ఇండ్​ బ్యాంక్ 1.31 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూ.11 లక్షల కోట్లు పెరిగిన సంపద..

బీఎస్​ఈ లిస్టెడ్​ కంపెనీల​ మదుపరుల సంపద 2019లో రూ.11 లక్షల కోట్లు పెరిగింది. ఈ ఏడాది మొత్తం మీద బీఎస్​ఈలో లిస్టెడ్ కంపెనీల మదుపరుల సంపద 14 శాతం పెరిగింది.

నేటికి బీఎస్​ఈ లిస్టెడ్​ కంపెనీల పూర్తి సంపద రూ.11,05,363.35 కోట్లు వృద్ధి చెంది.. రూ.1,55,53,829.04 కోట్లకు చేరింది.

ఇదీ చూడండి: రివ్యూ 2019: గత ఐదేళ్లలో ఈసారే తక్కువ ఐపీఓలు

Thiruvananthapuram (Kerala), Dec 31 (ANI): Kerala Assembly passed resolution against Citizens (Amendment) Act. Assembly demanded repeal of the CAA. BJP MLA O Rajagopal opposed the resolution. The resolution was moved by Chief Minister Pinarayi Vijayan.
Last Updated : Dec 31, 2019, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.