ETV Bharat / business

ఎయిర్‌టెల్‌ మొబైల్‌ యాప్‌లో భద్రతా లోపం..!

ఎయిర్‌టెల్‌ మొబైల్‌ యాప్‌లో భద్రతా లోపం తలెత్తినట్లు ఓ స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు గుర్తించాడు. అప్రమత్తమైన టెలికాం సంస్థ లోపాన్ని వెంటనే సరిచేసినట్లు తెలిపింది. ఫలితంగా వినియోగదారుల సమాచారం (డేటా) లీక్​ అయ్యే ముప్పు తప్పింది.

author img

By

Published : Dec 8, 2019, 3:09 PM IST

Security flaw in Airtel app exposes customers data, fixed now
ఎయిర్‌టెల్‌ మొబైల్‌యాప్‌లో భద్రతా లోపం.. ఫిక్స్​

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్​టెల్​ తన మొబైల్​ యాప్​ భద్రతా లోపాన్ని సరిచేసినట్లు ప్రకటించింది. ఫలితంగా సున్నితమైన వినియోగదారుల సమాచారం (డేటా) లీక్​ అయ్యే ముప్పు తప్పింది.

బెంగళూరుకు చెందిన స్వతంత్ర సైబర్ పరిశోధకుడు ఇరాజ్​ అహ్మద్​ ఎయిర్​టెల్​ యాప్​లోని భద్రతాలోపాన్ని గుర్తించాడు. ఇది చందాదారుల సున్నితమైన సమాచారాన్ని ఎవరైనా పొందడానికి అనుమతిస్తున్నట్లు తన బ్లాగ్​లో పేర్కొన్నాడు.

"ఎయిర్​టెల్​ యాప్​లోని భద్రతాలోపం వల్ల .. వినియోగదారుల పేర్లు, లింగం, ఈ-మెయిల్, పుట్టిన తేదీ, చిరునామా, చందా వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే వినియోగదారుల పరికరాల (సెల్​ఫోన్​) 4జీ, 3జీ, జీపీఆర్​ఎస్​ సామర్థ్యం, నెట్​వర్క్ సమాచారం, మొబైల్​ ఐఎమ్​ఈఐ నెంబర్ తదితర వివరాలు సులభంగా పొందవచ్చు. ఫలితంగా దేశంలోని 32.55 కోట్ల మంది వినియోగదారుల సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉంది. " - అహ్మద్, సైబర్​ పరిశోధకుడు​

ఐఎమ్​ఈఐ సంఖ్య ఆధారంగా వినియోగదారుని పరికరాన్ని (సెల్​ఫోన్​) సులభంగా గుర్తించడానికి వీలుపడుతుంది.

లోపాన్ని సరిచేశాం..

ఎయిర్‌టెల్‌ యాప్‌లోని అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌ (ఏపీఐ)లో ఈ భద్రతా లోపం తలెత్తినట్లు కంపెనీ తెలిపింది. లోపం గుర్తించిన వెంటనే దానిని సరిచేసినట్లు స్పష్టం చేసింది. ఎయిర్​టెల్ డిజిటల్ ప్లాట్​ఫాంలు అత్యంత భద్రంగా ఉన్నాయని వెల్లడించింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచార గోప్యత తమకు అత్యంత ప్రధానమని ఎయిర్​టెల్ పేర్కొంది.

ఇదీ చూడండి: యూఎస్​ కాంగ్రెస్​లో 'కశ్మీర్​'పై తీర్మానం.. ఖండించిన భారత్​

New Delhi, Dec 08 (ANI): Congress leader Alka Lamba reacted over the Anaj Mandi fire incident and criticized Delhi's Chief Minister Arvind Kejriwal. She said that Arvind Kejriwal has become insensitive. "Arvind Kejriwal is busy in tweeting and sharing other things on social media but haven't reacted on the fire incident," she further added. Massive fire that broke out at a factory on Dec 08 claimed at least 43 lives and more than 50 people have been rescued and were admitted to a nearby hospital.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.