ETV Bharat / business

'ఆ రంగాల ఉద్యోగులపై కరోనా ప్రభావం ఎక్కువ' - లాక్​డౌన్​తో నిరుద్యోగం

కరోనా రెండో దశ ప్రభావం తాత్కాలిక ఉద్యోగులపై ఎక్కువగా పడినట్లు ఓ అధ్యయనంలో తేలింది. స్థానిక లాక్​డౌన్​లతో వలసదారులు సొంతూరు బాట పట్టారని తెలిపారు అధ్యయనకర్తలు. దాని ప్రభావం కంపెనీలు, గిగ్​(తాత్కాలిక) ఉద్యోగులపై పడినట్లు పేర్కొన్నారు.

blue-collar, gig jobs
'ఆ రంగాల ఉద్యోగులపై కరోనా ప్రభావం ఎక్కువ'
author img

By

Published : May 16, 2021, 11:03 AM IST

కరోనా మహమ్మారి రెండో దశ ప్రభావం కంపెనీలు, గిగ్​(తాత్కాలిక) ఉద్యోగులపై అధికంగా పడినట్లు ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ముఖ్యంగా రిటైల్, హాస్పిటాలిటీ, ఏవియేషన్, నిర్మాణ రంగంలో ఉన్న తాత్కాలిక కార్మికులపై కొవిడ్ రెండో దశ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.

ఈ ఏడాది ప్రారంభంలో భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడం మొదలుపెట్టిందని వివరించారు అధ్యయనకర్తలు. ఈ క్రమంలోనే డిసెంబర్ త్రైమాసికంతో పోల్చితే... జనవరి-మార్చిలో ఉద్యోగ అవకాశాల సంఖ్య 32 శాతం మేర పెరిగినట్లు ప్రపంచ ఉద్యోగ నియామకాల సంస్థ మైఖేల్​ పేజ్ తెలిపింది. కరోనా రెండో దశలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఆయా రాష్ట్రాల్లో లాక్​డౌన్​ అమలు చేయడం కారణంగా.. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోందని తెలిపింది. అయితే ఇది గతేడాదితో పోల్చితే అంత ప్రభావం చూపదని అభిప్రాయపడింది.

స్థానిక లాక్​డౌన్​ను విధించడం వల్ల వలస కార్మికులు వారి సొంతూర్లకు తిరిగి రావడం వల్ల దాని ప్రభావం కంపెనీలు, గిగ్​(తాత్కాలిక) ఉద్యోగులపై పడినట్లు మైఖేల్​ పేజ్​ ఇండియా ఎండీ నికోలస్​ డుమౌలిన్​ తెలిపారు.

ఇదీ చూడండి: ఏప్రిల్​లో తగ్గిన ఉద్యోగ నియామకాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.