ETV Bharat / business

కిశోర్‌ బియానీపై ఏడాది పాటు నిషేధం - కిశోర్​ బియానీ న్యూస్

ఏడాది పాటు మార్కెట్లకు దూరంగా ఉండాలని ఫ్యూచర్‌ రిటైల్‌(ఎఫ్‌ఆర్‌ఎల్‌)కు చెందిన కిశోర్‌ బియానీ సహా మరికొందరు ప్రమోటర్లపై సెబీ నిషేధం విధించింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ దర్యాప్తు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Sebi bars Future retail CEO Kishore Biyani
కిశోర్‌ బియానీపై ఏడాది నిషేధం: సెబీ
author img

By

Published : Feb 4, 2021, 8:14 AM IST

ఫ్యూచర్‌ రిటైల్‌(ఎఫ్‌ఆర్‌ఎల్‌)కు చెందిన కిశోర్‌ బియానీ సహా మరికొందరు ప్రమోటర్లపై సెబీ ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ కాలంలో వీరు సెక్యూరిటీల మార్కెట్ల నుంచి దూరంగా ఉండాలి. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణల నేపథ్యంలో ఫ్యూచర్‌ కార్పొరేట్‌ రిసోర్సెస్‌కు చెందిన అనిల్‌ బియానీ, ఎఫ్‌సీఆర్‌ఎల్‌ ఎంప్లాయీ వెల్ఫేర్‌ ట్రస్ట్‌పైనా నిషేధం విధించారు. కిశోర్‌ బియానీ, అనిల్‌ బియానీ, ఫ్యూచర్‌ కార్పొరేట్‌ రిసోర్సెస్‌లపై రూ.కోటి చొప్పున అపరాధ రుసుమును సైతం మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ విధించింది. వీరు తప్పుడు పద్ధతిలో పొందిన రూ.17.78 కోట్ల లాభాలను వెనక్కి ఇచ్చేయాలనీ ఆదేశించింది.

ఫ్యూచర్‌ కార్పొరేట్‌ రిసోర్సెస్‌, ఎఫ్‌సీఆర్‌ఎల్‌ ఎంప్లాయీ వెల్ఫేర్‌ ట్రస్ట్‌లు కూడా అక్రమ మార్గంలో పొందిన రూ.2.75 కోట్ల లాభాలు వెనక్కి ఇవ్వాలని తెలిపింది. అనిల్‌ బియానీ, ఫ్యూచర్‌ కార్పొరేట్‌ రిసోర్సెస్‌లు ఎఫ్‌ఆర్‌ఎల్‌కు ప్రమోటర్లన్న సంగతి తెలిసిందే. కంపెనీకి చెందిన కొన్ని వ్యాపారాల విభజనకు సంబంధించి, ధరలపై ప్రభావం చూపే అప్రచురిత సమాచారం ఆధారంగా మార్చి 10, 2017 నుంచి ఏప్రిల్‌ 20, 2017 మధ్య కొంత మంది వ్యక్తులు, సంస్థలు ట్రేడింగ్‌ జరిపారా లేదా అనే విషయమై సెబీ దర్యాప్తు చేపట్టింది. వీరు ట్రేడింగ్‌ జరిపి చట్టవ్యతిరేకంగా లాభాలు పొందినట్లు తేలడంతో తాజా చర్యలు చేపట్టింది. ఫ్యూచర్‌ కార్పొరేట్‌ రిసోర్సెస్‌కు చెందిన మాజీ ఉద్యోగులైన పతక్‌, పాండేలపైనా రూ.25 లక్షల చొప్పున సెబీ అపరాధ రుసుము విధించింది. ఏడాది పాటు మార్కెట్ల నుంచి నిషేధం విధించింది. బియానీలు, ఫ్యూచర్‌కార్పొరేట్‌ రిసోర్సెస్‌, ఇద్దరు ఉద్యోగులు రెండేళ్ల పాటు ఎఫ్‌ఆర్‌ఎల్‌ షేర్లలో ట్రేడింగ్‌ చేపట్టకూడదనీ ఆదేశించింది.

ఫ్యూచర్‌ రిటైల్‌ అప్పీలుపై నేడు హైకోర్టులో విచారణ

కిశోర్‌ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌ రిటైల్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ రిటైల్‌తో కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పంద ప్రక్రియను యథాస్థితిలో ఉంచాలని ఏక జడ్జి ఇచ్చిన ఆదేశాలపై ఫ్యూచర్‌ రిటైల్‌ అప్పీలు చేసింది. ఫ్యూచర్‌ రిటైల్‌-రిలయన్స్‌ రిటైల్‌ ఒప్పందాన్ని అమెరికా ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. హైకోర్టు సంయుక్త రిజిస్ట్రార్‌కు ఫ్యూచర్‌ రిటైల్‌ అప్పీలు చేసిందని, గురువారం విచారణకు కోర్టు లిస్ట్‌ చేసినట్లు ఈ కేసుకు సంబంధం ఉన్న ఒక న్యాయవాది తెలిపారు.

ఇదీ చదవండి:మరో కోటి కొవిషీల్డ్​ డోసులకు ప్రభుత్వం ఆర్డర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.