దివాలా స్మృతిలోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ తనకు బదిలీ చేయాలని గురువారం సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులను ఆదేశించింది. ముఖ్యంగా వ్యక్తిగత దివాలా విషయంలో కేసులు నమోదయ్యాయి.
ఇకపై ఇందుకు సంబంధించి కొత్త వ్యాజ్యాలను స్వీకరించకూడదని హైకోర్టులకు సూచించింది. ఇంతవరకు హైకోర్టులు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.
ఆ తదుపరి విచారణను డిసెంబరు రెండో తేదీకి వాయిదా వేసింది.