ETV Bharat / business

ఎయిర్​టెల్, వొడాఫోన్​- ఐడియాలకు సుప్రీం సమన్లు!

తమ తీర్పును బేఖాతరు చేస్తూ, రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్​ బకాయిలను గడువులోగా చెల్లించని టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. దీనిని కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించకూడదో తెలిపాలని ఆయా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్లను ఆదేశించింది.

AGR woes: Is there no law left in this country, asks SC
ఎయిర్​టెల్, వొడాఫోన్​-ఐడియాలకు సుప్రీం సమన్లు!
author img

By

Published : Feb 14, 2020, 12:46 PM IST

Updated : Mar 1, 2020, 7:47 AM IST

టెలికాం సంస్థలు భారతీ ఎయిర్​టెల్​, వొడాఫోన్-ఐడియా, టాటా టెలీసర్వీస్​లకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. తమ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ, రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్​ బకాయిలను గడువులోగా టెలికాం విభాగానికి (డీఓటీ) చెల్లించపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించకూడదో తెలపాలని ఆదేశించింది.

నాన్ ​సెన్స్​..

జస్టిస్​ అరుణ్​మిశ్రా, జస్టిస్ ఎస్​ అబ్దుల్ నజీర్​, జస్టిస్ ఎం.ఆర్.షాల త్రిసభ్య ధర్మాసనం డీఓటీ డెస్క్ ఆఫీసర్ ఉత్తర్వుపై అభ్యంతరం తెలిపింది. ​టెలికాం సంస్థలు ఏజీఆర్ బకాయిలు చెల్లించాలని తాము ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ డీఓటీ డెస్క్ ఆఫీసర్​ ఉత్తర్వులు జారీ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది.

"ఈ అర్థంపర్థంలేని దాన్ని ఎవరు సృష్టిస్తున్నారో మాకు తెలియడంలేదు. అసలు ఈ దేశంలో న్యాయం ఉందా! దీనిని చూస్తూ ఇక్కడ ఉండడం కంటే దేశం విడిచిపోవడం మంచిది."- సుప్రీం ధర్మాసనం

టెల్కోలు, ఇతరులు ఏజీఆర్​ బకాయిలు చెల్లించకపోయినా, వారిని బలవంతపెట్టద్దని డీఓటీ డెస్క్ అధికారి... ఆటార్నీ జనరల్​, ఇతర రాజ్యాంగ అధికారులకు లేఖ రాశారు.

చెల్లించాల్సిందే..

2020 జనవరి 23 లోపు టెలికాం సంస్థలు రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్​ బకాయిలు చెల్లించాల్సిందేనని ఇంతకు ముందు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

కంపెనీల వారీగా బాకాయిలు ఇలా..

  • ఎయిర్​టెల్ రూ.21,682.13 కోట్లు
  • వొడాఫోన్-ఐడియా రూ.19,823.71 కోట్లు
  • ఆర్​కాం రూ.16,456.47 కోట్లు
  • బీఎస్​ఎన్​ఎల్​ రూ.2,098.72 కోట్లు
  • ఎంటీఎన్​ఎల్​ రూ.2,537.48 కోట్లు

ఇదీ చూడండి: భారత ఆర్థికస్థితి బలహీనంగా ఉంది: ఐఎమ్​ఎఫ్​

Last Updated : Mar 1, 2020, 7:47 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.