కోర్టు ధిక్కరణ కేసులో తనను దోషిగా పేర్కొంటూ 2017లో ఇచ్చిన తీర్పును మళ్లీ సమీక్షించాలని రుణాల ఎగవేతదారు విజయ్ మల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వు చేసింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 4 కోట్ల డాలర్ల సొమ్మును తన వారసులకు బదిలీ చేయడంపై విజయ్ మల్యాను సుప్రీంకోర్టు 2017లో దోషిగా తేల్చింది.
ఈ తీర్పును పునఃసమీక్షించాలంటూ మల్యా వేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీం విచారణ చేపట్టింది. 2017లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ అతని కుమారుడు, కుమార్తెలకు 4 కోట్ల డాలర్లను మాల్యా బదిలీ చేశారని ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకు కన్సార్టియం సుప్రీంలో పిటిషన్ వేసింది.
ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం విజయ్ మల్యాను కోర్టు ధిక్కరణ కింద దోషిగా తేలుస్తూ 2017 మే లో తీర్పు వెలువరించింది.
ఇదీ చూడండి: 'అసలు మొత్తం తీసుకోండి.. నన్ను వదిలేయండి'