పంజాబ్-మహారాష్ట్ర సహకార బ్యాంకు ఖాతాదారులు వేసిన దావాను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పీఎంసీ బ్యాంకులో నగదు ఉపసంహరణపై రిజర్వు బ్యాంకు విధించిన ఆంక్షలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఆర్టికల్ 32 ప్రకారం ఈ అంశాన్ని విచారించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ విషయంలో న్యాయవాదులు సంబంధిత హైకోర్టును ఆశ్రయించొచ్చని సూచించింది.
విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా.. సమస్య తీవ్రత గురించి ప్రభుత్వానికి తెలుసని వివరించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఇదీ చూడండి : ఎయిర్ ఇండియాకు ఇంధన సరఫరా కొనసాగింపు!