ETV Bharat / business

ఆ లోపు అమ్ముడైన బీఎస్4 వాహనాలకే రిజిస్ట్రేషన్:సుప్రీం - మార్చి ముందు విక్రయమైన బీఎస్​4 వాహనాలకే రిజిస్ట్రేషన్

బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్లను ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన సుప్రీం కోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 ముందు వరకు విక్రయమై.. ఫోర్టల్​లో నమోదైన బీఎస్​-4 వాహనాలు మాత్రమే రిజిస్ట్రెషన్​ చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఆ తర్వాత కొనుగోలు చేసిన వాహనాల రిజిస్ట్రేషన్​కు అనుమతి లేదని స్పష్టం చేసింది.

BS4 Vehicle Registration News
బీఎస్​-4 వాహనాల రిజిస్ట్రేషన్​పై
author img

By

Published : Aug 13, 2020, 7:57 PM IST

బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31కు ముందు విక్రయించిన, ఈ-వాహన్‌ పోర్టల్‌లో నమోదు అయిన వాహనాల రిజిస్ట్రేషన్‌కు అనుమతించింది. పోర్టల్‌లో నమోదు కాని, మార్చి 31 తర్వాత విక్రయించిన వాహనాల రిజిస్ట్రేషన్‌కు అనుమతించడం లేదని పేర్కొంది. దిల్లీ-ఎన్‌సీఆర్‌కు ఈ ఉత్తర్వులు వర్తించబోవని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులతో మార్చి 31 కంటే ముందు వాహనాలు కొని రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేకపోయిన వారికి ఊరట కలగనుంది.

ఇటీవల రిజిస్ట్రేషన్ల నిలిపివేత

బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్లను ఇటీవల సుప్రీం కోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ సమయంలో అసాధారణ రీతిలో జరిగిన ఆ వాహన విక్రయాల అంశం తేలే వరకు రిజిస్ట్రేషన్లు చేయొద్దని అధికారులను ఆదేశించింది. లాక్‌డౌన్‌ సమయంలో మార్చి చివర్లో, ఆ తర్వాత పెద్దఎత్తున ఈ తరహా వాహన విక్రయాలు చేపట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ క్రమంలో గురువారం విచారణ చేపట్టి ఆదేశాలు ఇచ్చింది.

వాహన విక్రయాల లెక్కలు ఇలా..

ఈ ఏడాది మార్చి 12 నుంచి 31 మధ్య 11 లక్షలకు పైగా బీఎస్‌ -4 వాహన విక్రయాలు జరిగినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ విచారణ సందర్భంగా ధర్మాసనానికి నివేదిక సమర్పించింది. అందులో 2.9 లక్షల వాహనాలు లాక్‌డౌన్‌ సమయంలో 29, 30, 31 తేదీల్లో విక్రయాలు జరిగినట్లు పేర్కొంది. మార్చి 31 లోపు విక్రయించిన 39వేల వాహనాలకు సంబంధించిన వివరాలు ఈ-వాహన్‌ పోర్టల్‌లో నమోదు కాలేదని ధర్మాసనం దృష్టికి వచ్చింది. దీంతో వాటి రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇవ్వడం లేదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టంచేసింది.

ఇదీ చూడండి:జులైలోనూ పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం.. కారణమిదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.