ETV Bharat / business

లాక్​డౌన్​లోనూ ఎస్​బీఐ జోరు.. క్యూ1 లాభం 81% జంప్

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్​బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.4,189.34 కోట్ల నికర లాభాన్ని గడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే.. ఎస్​బీఐ నికర లాభం 81 శాతం పెరగటం గమనార్హం.

sbi profits
ఎస్​బీఐ లాభాలు
author img

By

Published : Jul 31, 2020, 4:25 PM IST

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్​ బ్యాంక్ (ఎస్​బీఐ) లాక్​డౌన్​లోనూ భారీ లాభాలను గడించింది. 2020-21 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఏకంగా రూ.4,189.34 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ఎస్​బీఐ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1తో పోలిస్తే ఇది 81 శాతం అధికం. 2019-20 క్యూ1తో ఎస్​బీఐ నికర లాభం రూ.2,312.02 కోట్లుగా నమోదైంది.

ఎస్​బీఐ ఏకీకృత ఆదాయం కూడా.. 2019-20 క్యూ1తో (రూ.70,653.23 కోట్లు) పోలిస్తే.. 2020-21 మొదటి త్రైమాసికంలో రూ.74,457.86 కోట్లకు పెరిగింది.

స్థూల నిరర్ధక ఆస్తులు కూడా క్యూ1లో 5.44 శాతానికి తగ్గినట్లు ఎస్​బీఐ తెలిపింది. 2019-20 ఇదే సమయంలో ఇవి 7.53 శాతంగా ఉన్నాయి.

క్యూ1లో నికర నిరర్ధక ఆస్తులు.. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో పోలిస్తే 3.07 శాతం నుంచి 1.8 శాతానికి తగ్గాయి.

ఇదీ చూడండి:ఆగస్టు నుంచి భారీగా తగ్గనున్న కార్లు, బైక్​ల ధరలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.