దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) రిటైల్ డిపాజిటర్ల కోసం ప్లాటినమ్ టర్మ్ డిపాజిట్స్ పేరుతో స్పెషల్ డిపాజిట్ స్కీంను ప్రవేశపెట్టింది. దీనిలో 75 రోజులు, 75 వారాలు, 75 నెలల కాలపరిమితితో టర్మ్ డిపాజిట్లను స్వీకరిస్తారు. డిపాజిటర్లు ఈ పథకం ద్వారా 15 బేసిస్ పాయింట్ల వరకు అదనపు వడ్డీ ప్రయోజనాన్ని పొందొచ్చు.
75వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని డిపాజిట్‌దారులకు ప్రత్యేక ప్రయోజనాలను అందించేందుకు ఈ ప్లాటినమ్ టర్మ్ డిపాజిట్స్‌ను ఎస్‌బీఐ తీసుకొచ్చింది. సెప్టెంబరు 14 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది.
ఎస్‌బీఐ ప్లాటినమ్ డిపాజిట్స్ స్కీం కింద సాధారణ ప్రజలకు అందిస్తున్న వడ్డీ రేట్లు..
కాలపరిమితి: ప్లాటినం - 75 రోజులు
ప్రస్తుత వడ్డీ రేటు: 3.90 శాతం
ప్రతిపాదిత వడ్డీ రేటు: 3.95 శాతం
కాలపరిమితి: ప్లాటినం - 525 రోజులు
ప్రస్తుత వడ్డీ రేటు: 5.00 శాతం
ప్రతిపాదిత వడ్డీ రేటు: 5.10 శాతం
కాలపరిమితి: ప్లాటినం - 2250 రోజులు
ప్రస్తుత వడ్డీ రేటు: 5.40 శాతం
ప్రతిపాదిత వడ్డీ రేటు: 5.55 శాతం
ఎస్‌బీఐ ప్లాటినమ్ డిపాజిట్స్ స్కీం కింద సీనియర్ సిటిజన్లకు అందిస్తున్న వడ్డీ రేట్లు..
కాలపరిమితి: ప్లాటినం - 75 రోజులు
ప్రస్తుత వడ్డీ రేటు: 4.40 శాతం
ప్రతిపాదిత వడ్డీ రేటు: 4.45 శాతం
కాలపరిమితి: ప్లాటినం - 525 రోజులు
ప్రస్తుత వడ్డీ రేటు: 5.50 శాతం
ప్రతిపాదిత వడ్డీ రేటు: 5.60 శాతం
కాలపరిమితి: ప్లాటినం - 2250 రోజులు
వడ్డీ రేటు: 6.20 శాతం (ఎస్‌బీఐ వియ్‌కేర్ స్కీం కింద వడ్డీ రేటు వర్తిస్తుంది)
సీనియర్ సిటిజన్లకు స్పెషల్ ఎఫ్‌డీ స్కీం:
సీనియర్ సిటిజన్ల కోసం 'SBI We Care' పేరుతో ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని అందిస్తోంది. ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలపరిమితితో ఈ పథకంలో డిపాజిట్ చేసిన సీనియర్ సిటిజన్లకు.. సాధారణంగా వర్తించే వడ్డీ రేటు కంటే 30 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ లభిస్తుంది.
సాధారణ ప్రజలకు వర్తించే రేటు కంటే 80 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) అదనపు వడ్డీ రేటు అందిస్తుంది. ప్రస్తుతం ఎస్‌బీఐ సాధారణ ప్రజలకు 5 ఏళ్ల ఎఫ్‌డీపై 5.4 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తుండగా, సీనియర్ సిటిజన్ ప్రత్యేక ఎఫ్‌డీ పథకంలో చేసిన డిపాజిట్లకు 6.20 శాతం వడ్డీ అందిస్తోంది.
సాధారణ ప్రజలకు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు
7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితితో ఫిక్స్‌డ్ డిపాటిట్ చేసే సదుపాయాన్ని ఎస్‌బీఐ అందిస్తోంది. వడ్డీ రేట్లు 2.9 శాతం నుంచి మొదలుకుని 5.4 శాతం వరకు ఉంటాయి. ఎంచుకున్న కాలపరిమితిపై ఆధారపడి వడ్డీ రేటు వర్తిస్తుంది. రూ.2 కోట్లు అంతకంటే తక్కువ ఉన్న రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు ఎస్‌బీఐ అందిస్తున్న వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
- 7 రోజులు నుంచి 45 రోజుల వరకు - 2.9 శాతం
- 46 రోజులు నుంచి 179 రోజుల వరకు - 3.9 శాతం
- 180 రోజులు నుంచి 210 రోజుల వరకు - 4.4 శాతం
- 211 రోజులు నుంచి ఏడాది లోపు - 4.4 శాతం
- ఏడాది నుంచి రెండేళ్ల లోపు -5 శాతం
- రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు - 5.1 శాతం
- మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు - 5.3 శాతం
- ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు - 5.4 శాతం
(ఈ వడ్డీ రేట్లు 2021 జనవరి 8 నుంచి అమల్లో ఉన్నాయి)
ఇదీ చదవండి: ఎస్‌బీఐ ప్రత్యేక ఆఫర్లు- వాటిపై 70% డిస్కౌంట్!