ETV Bharat / business

గూగుల్ పేలో ఎస్‌బీఐ ఆరోగ్య బీమా పాలసీ!

డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఆరోగ్య బీమా(Health Insurance) పాల‌సీల‌ను క‌స్ట‌మ‌ర్ల‌కు అందించేందుకు గూగుల్‌పేతో జత కట్టింది ఎస్‌బీఐ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్. దీంతో క‌స్ట‌మ‌ర్లు ఇక‌పై గూగుల్‌పే స్పాట్‌లో క్ష‌ణాల్లో ఇంటి నుంచే ఆరోగ్య బీమా కొనుగోలు చేయ‌వచ్చని ప్రకటించింది.

SBI general insurance
గూగుల్ పేలో ఎస్​బీఐ ఆరోగ్య బీమా
author img

By

Published : Oct 29, 2021, 1:23 PM IST

ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన ఎస్‌బీఐ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సేవ‌ల‌ను విస్త‌రిస్తూ వ‌స్తోంది. డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఆరోగ్య బీమా(Health Insurance) పాల‌సీల‌ను క‌స్ట‌మ‌ర్ల‌కు అందించేందుకు గూగుల్‌పేతో భాగ‌స్వామ్యం కుదుర్చుకుంది. గూగుల్‌పే యాప్ ద్వారా ఇంటి నుంచే ఎటువంటి అవాంత‌రాలు లేకుండా, త్వ‌రితగ‌తిన ఆరోగ్య బీమా పాల‌సీని కొనుగోలు చేసేందుకు వీలు క‌ల్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

దేశంలోని బీమా సంస్థ‌తో.. గూగుల్ పే జ‌త‌క‌ట్ట‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. క‌స్ట‌మ‌ర్లు ఇక‌పై గూగుల్‌పే స్పాట్‌లో క్ష‌ణాల్లో ఆరోగ్య బీమా కొనుగోలు చేయ‌చ్చు. ఇక్క‌డ ఆరోగ్య బీమా పాల‌సీని ఎస్‌బీఐ జ‌న‌ర‌ల్ ఇన్సురెన్స్ సంస్థ అందిస్తుంది. గూగుల్ పే టెక్నిక‌ల్ స‌ర్వీస్‌ను మాత్ర‌మే అందిస్తుంది.

ప్ర‌స్తుత రోజుల్లో విన‌యోగ‌దారుల‌కు త‌మ అవ‌స‌రాల గురించి పూర్తి అవ‌గాహ‌న ఉంది. కొవిడ్‌-19 కార‌ణంగా డిజిట‌ల్ వినియోగం బాగా పెరిగింది. క‌రెంటు బిల్లుల ద‌గ్గ‌ర నుంచి బ్యాంకు లావాదేవీలు వ‌ర‌కు అన్ని ఆర్థిక ప‌ర‌మైన అవ‌స‌రాల‌కు డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సాంకేతిక‌ ప‌రిష్కారం ల‌భించింది. చాలావ‌ర‌కు చెల్లింపులు ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఇంటి నుంచే చేయ‌గ‌లుగుతున్నాము.

ఆరోగ్య బీమా కోసం పెరుగుతున్న అవ‌స‌రాన్ని తీర్చేందుకు.. ఎక్కువ సంఖ్య‌లో ప్ర‌జ‌ల‌ను ఆరోగ్య బీమా ప‌రిధిలోకి తీసుకొచ్చేందుకు ఎస్‌బీఐ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్‌, గూగుల్‌పే క‌ల‌యిక ఒక చక్క‌ని ప్ర‌య‌త్నం అని ఎస్‌బీఐ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ తెలిపింది. అంతేకాకుండా గూగుల్‌పే స్పాట్ ద్వారా ఆరోగ్య సంజీవిని పేరుతో.. ఒక ప్రామాణిక ఆరోగ్య బీమా ప్లాన్ అందిస్తున్న‌ట్లు తెలిపింది.

గూగుల్ పే స్పాట్‌లో..

  • ఎస్‌బీఐ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ అందించే ఆరోగ్య సంజీవని పాల‌సీ గూగుల్‌పే స్పాట్‌లో అందుబాటులో ఉంది.
  • ఆరోగ్య సంజీవని అనేది ఒక ప్రామాణిక ఆరోగ్య బీమా పాలసీ.. అతి త‌క్కువ ప్రీమియంతో ప్రామాణిక కవరేజీని అందించేందుకు ఎస్‌బీఐ జ‌న‌ర‌ల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ పాల‌సీని ప్రారంభించింది.
  • వినియోగదారులు గూగుల్‌పే స్పాట్‌ ద్వారా ఆరోగ్య సంజీవని పాలసీ కింద వ్యక్తిగత, కుటుంబ ప్లాన్‌లను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.