ETV Bharat / business

ఎస్​బీఐ శుభవార్త- హోం లోన్స్​పై వడ్డీ రాయితీ - sbi latest news

గృహ రుణాలపై వడ్డీ రేటులో కోత విధిస్తున్నట్లు ఎస్​బీఐ ప్రకటించింది. ప్రాసెసింగ్​ ఫీజును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రూ.30లక్షల లోపు గృహ రుణాలకు 6.80 శాతం నుంచి, ఆపై మొత్తానికి 6.95శాతం నుంచి వడ్డీ రేటు మొదలవుతుందని పేర్కొంది.

SBI announces up to 30 bps concession on home loans rates
ఎస్బీఐ శభవార్త- గృహ రుణాలపై వడ్డీ రాయితీ
author img

By

Published : Jan 8, 2021, 2:54 PM IST

Updated : Jan 8, 2021, 3:19 PM IST

గృహ రుణాలు తీసుకునే వారికి భారతీయ స్టేట్ బ్యాంక్ శుభవార్త తెలిపింది. వడ్డీ రేటుపై 30 బేసిస్​ పాయింట్ల కోత విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ప్రాసెసింగ్​ ఫీజును 100 శాతం మాఫీ చేయనున్నట్లు వెల్లడించింది.

నూతన గృహ రుణాలపై వడ్డీ రేటును సిబిల్ స్కోర్ ఆధారంగా నిర్ణయించనున్నట్లు ఎస్​బీఐ పేర్కొంది. రూ.30లక్షల వరకు రుణాలు తీసుకుంటే 6.80 శాతం నుంచి వడ్డీ ఉంటుందని, రూ.30లక్షలు దాటే గృహ రుణాలకు అది 6.95శాతంగా ఉంటుందని ప్రకటనలో తెలిపింది.

మహిళా వినియోగదారులకు వడ్డీ రేటుపై 5 బేసిస్​ పాయింట్ల రాయితీ లభిస్తుందని ఎస్​బీఐ పేర్కొంది. దేశంలో అతిపెద్ద బ్యాంకుగా ఉన్న తాము ఇళ్లు కొనాలకునే వారికి ఆకర్షణీయమైన ఆఫర్​ అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.

దేశంలోని 8 మెట్రో నగరాల్లో రూ. 5 కోట్ల లోపు గృహ రుణాలకు 30 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రాయితీ అందుబాటులో ఉంటుందని ఎస్​బీఐ వెల్లడించింది. వినియోగదారులు ఇంటి నుంచే యోనో యాప్​ ద్వారా 5 బేసిస్​ పాయింట్ల అదనపు వడ్డీ రాయితీ పొందవచ్చని తెలపింది. 2021, మార్చి వరకు ఈ ఆఫర్ ఉంటుందని చెప్పింది.

ఇదీ చూడండి: బీఎస్​ఈ కంపెనీల ఎం-క్యాప్ ఆల్​టైం రికార్డ్

Last Updated : Jan 8, 2021, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.