ETV Bharat / business

ఒక్కో మెట్టూ ఎదుగుతూ.. ఉన్నత శిఖరాలకు - సత్యనాదెళ్ల స్టోరీ

మైక్రోసాఫ్ట్‌లో ఒక్కో మెట్టూ ఎదుగుతూ ప్రస్తుతం ఛైర్మన్‌ స్థాయికి చేరారు తెలుగు వ్యక్తి సత్యనాదెళ్ల. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓ బాధ్యతలు చేపట్టిన అనంతరం.. ఆ సంస్థలో సమూల మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. సత్వరం వృద్ధి సాధించే లక్ష్యంతో కొత్త వ్యాపార విభాగాలపై దృష్టి సారించారు. ఫలితంగా మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌ విలువ ఏడు రెట్లు పెరిగి రెండు లక్షల కోట్ల డాలర్లకు దగ్గరైంది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌.. తదితర కొన్ని విభాగాల్లో అగ్రస్థానానికి చేరుకుంది.

satya nadella, microsoft new chairman
సత్యనాదెళ్ల
author img

By

Published : Jun 18, 2021, 7:04 AM IST

మైక్రోసాఫ్ట్‌లో అంచెలంచెలుగా ఎదిగి సీఈఓ-ఛైర్మన్‌ స్థాయికి చేరారు సత్యనాదెళ్ల. 2014లో ఆయన సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారి) బాధ్యతలు చేపట్టే నాటికి మొబైల్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ సెర్చ్‌ మార్కెట్లలో మైక్రోసాఫ్ట్‌ పరిస్థితి గొప్పగా లేదు. మైక్రోసాఫ్ట్‌ ప్రధాన ఉత్పత్తి (ఫ్లాగ్‌షిప్‌ ప్రోడక్ట్‌) అయిన విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ పరిస్థితుల్లో సత్య నాదెళ్ల సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. సత్వరం వృద్ధి సాధించే లక్ష్యంతో కొత్త వ్యాపార విభాగాలపై దృష్టి సారించారు. ప్రధానంగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌, మొబైల్‌ అప్లికేషన్లు, కృత్రిమ మేధ (ఏఐ).. తదితర నూతన వ్యాపార విభాగాలపై దృష్టి కేంద్రీకరించారు.

మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ ఫ్రాంచైజీని పూర్తిగా నవీకరించారు. ఎన్నో కొత్త ప్రాజెక్టులు ఆవిష్కరించారు. యాపిల్‌ ఐప్యాడ్‌కు ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేశారు. ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ యాప్స్‌ తీసుకువచ్చారు. విండోస్‌ 9 వదిలేసి నేరుగా విండోస్‌ 10 ఆవిష్కరించారు. అజూరే క్లౌడ్‌లో లైనక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ఉపయోగించారు. మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ బుక్‌ అనే ల్యాప్‌ట్యాప్‌ను విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుల ఫలితంగా కంపెనీ ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. దానికి అనుగుణంగా మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌ విలువ (మార్కెట్‌ కేపిలైజేషన్‌) ఏడు రెట్లు పెరిగి రెండు లక్షల కోట్ల డాలర్లకు దగ్గరైంది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌.. తదితర కొన్ని విభాగాల్లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విభాగంలో గూగుల్‌ కంటే మైక్రోసాఫ్ట్‌ అధిక ఆదాయాలు నమోదు చేసే స్థితికి ఎదిగింది. ఈ మార్పుల ఫలితంగా ఒక అగ్రశ్రేణి ఐటీ కంపెనీగా మైక్రోసాఫ్ట్‌ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. త్వరలోనే విండోస్‌ 11ను ఆవిష్కరించనుంది.

కొంతకాలం సన్‌ మైక్రోసిస్టమ్స్‌లో

కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్‌, ఐటీ సేవలు విక్రయించే సంస్థ అయిన సన్‌ మైక్రోసిస్టమ్స్‌లో తొలుత సత్య నాదెళ్ల పనిచేశారు. అక్కడి నుంచి 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. అక్కడి నుంచి ఆయన ప్రగతి ప్రస్థానం శరవేగంగా సాగింది. ఆ మరుసటి ఏడాదే మైక్రోసాఫ్ట్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌ విభాగానికి కార్పొరేట్‌ ఉపాధ్యక్షుడు అయ్యారు. 2007లో మైక్రోసాఫ్ట్‌ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌కు సీనియర్‌ ఉపాధ్యక్షుడిగా నియమితుడై బింగ్‌, ఆఫీస్‌, ఎక్స్‌బాక్స్‌ లైవ్‌.. తదితర ప్రాజెక్టులు పర్యవేక్షించారు. 2011లో సర్వర్‌ అండ్‌ టూల్స్‌ విభాగానికి అధ్యక్షుడిగా అజూరే క్లౌడ్‌, విండోస్‌ సర్వర్‌, ఎస్‌క్యూఎల్‌ సర్వర్‌ డేటాబేస్‌ వ్యవహారాలు చూశారు. సర్వర్‌ అండ్‌ టూల్స్‌ విభాగం ఆదాయాలను 16.6 బిలియన్‌ డాలర్ల నుంచి 20.3 బిలియన్‌ డాలర్లకు పెంచారు. 2014లో ఆయన్ను మైక్రోసాఫ్ట్‌ సీఈఓ పదవి వరించింది. అప్పటి వరకు సీఈఓగా ఉన్న స్టీవ్‌ బామర్‌ దిగిపోగా, ఆ స్థానాన్ని సత్య నాదెళ్లకు అప్పగించారు. ఇది బిల్‌ గేట్స్‌ తీసుకున్న నిర్ణయం అంటారు.

అమెరికాలో ఎంఎస్‌, ఎంబీఏ

సత్య నాదెళ్ల బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎస్‌) విద్యార్థి. ఆ తర్వాత ఎలాగైనా ఐఐటీలో చేరి ఇంజనీరింగ్‌ చేయాలనుకున్నారు. కానీ మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చేరాల్సి వచ్చింది. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ పూర్తిచేసి ఎంఎస్‌ కోసం అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్‌ విస్‌కాన్సిన్‌- మిల్వాకీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో ఎంఎస్‌ చేశారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్‌ చికాగో- బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎంబీఏ చదివారు. క్రికెట్‌ అంటే అమితంగా ఇష్టపడతారు. ప్రస్తుతం ఆయన బెల్లెవ్యూ- వాషింగ్టన్‌లో నివాసం ఉంటున్నారు. సత్య నాదెళ్ల తండ్రి యుగంధర్‌ ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. వివిధ శాఖల్లో కార్యదర్శిగా పనిచేయడంతో పాటు ముస్సోరిలోని ఐఏఎస్‌ ట్రైనింగ్‌ అకాడమికీ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ప్రణాళిక సంఘం సభ్యుడిగా కూడా ఉన్నారు. సత్య నాదెళ్ల భార్య అనుపమ తండ్రి కేకే వేణుగోపాల్‌ కూడా ఐఏఎస్‌ అధికారే. నలుగురు ప్రధాన మంత్రుల వద్ద కార్యదర్శిగా పనిచేసిన ఘనత వేణుగోపాల్‌కు ఉంది.

ఫైనాన్షియల్‌ టైమ్స్‌ 'పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌'

2019లో ఫైనాన్షియల్‌ టైమ్స్‌ 'పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌' గా సత్య నాదెళ్ల ఎంపికయ్యారు. ఆ మరుసటి ఏడాదే బ్యారన్స్‌ వరల్డ్స్‌ '30 బెస్ట్‌ సీఈఓస్‌' జాబితాలో స్థానం సంపాదించారు. మైక్రోసాఫ్ట్‌ షేర్లు, జీతభత్యాల రూపంలో లభించిన సొమ్ముతో సంపన్నుల జాబితాలోనూ ఆయనకు స్థానం లభించింది. సత్య నాదెళ్ల నికర సంపద విలువ 300 మిలియన్‌ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. ఆయన 'హిట్‌ రిఫ్రెష్‌' అనే పేరుతో తన ఆత్మకథ రాశారు. తన ఉద్యోగ ప్రస్థానం, ఎదుర్కొన్న సవాళ్లు, టెక్నాలజీ మార్పులు..వంటి ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకం మీద వచ్చిన ఆదాయాన్ని ఆయన మైక్రోసాఫ్ట్‌ చేపట్టే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు కేటాయించారు. ఫ్రెడ్‌ హచిన్‌సన్‌ కేన్సర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ బోర్డు సభ్యుడిగా ఉన్నారు.

100 మందిలో 6వ స్థానం

కొవిడ్‌ -19 సంక్షోభంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ, భద్రత, వారి సంక్షేమం, కంపెనీ కార్యక్రమాల అమలు, నాయకత్వ ప్రదర్శన.. వంటి అంశాల్లో ఉద్యోగుల అభిప్రాయలు సేకరించి, 100 మంది సీఈఓల జాబితాను గ్లాస్‌డోర్‌ రూపొందిస్తోంది. 2021 జాబితాలో సత్య నాదెళ్లకు 6వ స్థానం లభించింది. 97 శాతం మంది ఆయనకు మద్దతుగా నిలిచారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.