మొబైల్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న గెలాక్సీ మడత ఫోన్లను నేడు మార్కెట్లోకి విడుదల చేస్తోంది మొబైల్ దిగ్గజం శాంసంగ్. దక్షిణ కొరియాలో నేటి నుంచి ఎంపిక చేసిన మార్కెట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని శాంసంగ్ తెలిపింది.
ఏప్రిల్ 26నే ఈ ఫోన్ను విడుదల చేయాలని భావించినా టెస్టింగ్ దశలో డిస్ప్లేపై భారీ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. ఈ కారణంగా విడుదలను వాయిదా వేసింది. ఫోన్ మడత పెట్టేందుకు సహకరించే కీలు భాగాలకు ఇరువైపులా (పైనా, కింద) అదనపు రక్షణ కవచాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ ఫోల్డబుల్ ఫోన్ యూజర్లకు ప్రత్యేక అనుభూతి ఇస్తుందని శాంసంగ్ చెబుతోంది.
గెలాక్సీ ఫోల్డ్ ఫీచర్లు:
- వెనుక కెమెరా: 16 ఎంపీ+ 12 ఎంపీ+ 12 ఎంపీ (3 కెమెరాలు)
- 10 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 16 జీబీ ర్యామ్/512 జీబీ ఇంటర్నల్ మెమొరీ
- క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 855 ఆక్టా-కోర్ ప్రాసెసర్
ఇతర కీలక ఫీచర్లతో ఆకట్టుకునే ఈ ఫోన్ను భారత్లోనే ముందుగా విడుదల చేయాలనుకుంది శాంసంగ్. అయితే కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. భారత్లో విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి:టీచర్స్ డే: నిష్ఠతో ఉపాధ్యాయ శిక్షణ