ETV Bharat / business

గూగుల్, ఒప్పోకు శాంసంగ్ సాయం..! - ఫోల్డింగ్ డిస్​ప్లే

ఫోల్డింగ్​ డిస్​ప్లే ఫోన్​ల కోసం మూడు దిగ్గజ మొబైల్ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి. గూగుల్​, ఒప్పో కంపెనీలకు శాంసంగ్ ఫోల్డింగ్​ డిస్​ప్లేను తయారు చేస్తోంది. గతేడాది గెలాక్సీ జెడ్ ఫోల్డ్‌ 2, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫోల్డింగ్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది శాంసంగ్. ఒప్పో కూడా ఫోల్డింగ్, రోలింగ్ డిస్‌ప్లేతో ఫోన్లను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

samsung-developing-folding-display-for-google-xiaomi-and-oppo
గూగుల్, ఒప్పోకు శాంసంగ్ సాయం..!
author img

By

Published : Feb 24, 2021, 9:55 PM IST

భవిష్యత్తు అవసరాల కోసం కొన్ని సార్లు దిగ్గజ కంపెనీలు కలిసి పనిచేస్తుంటాయి. ప్రస్తుతం శాంసంగ్‌, గూగుల్, ఒప్పో కంపెనీలు ఇదే బాటలో నడుస్తున్నాయి. గతేడాది గెలాక్సీ జెడ్ ఫోల్డ్‌ 2, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫోల్డింగ్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది శాంసంగ్. ఒప్పో కూడా ఫోల్డింగ్, రోలింగ్ డిస్‌ప్లేతో ఫోన్లను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ సైతం ఫోల్డింగ్ ఫోన్‌ తయారీలో పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో గూగుల్ ఫోల్డింగ్ ఫోన్ కోసం శాంసంగ్ ప్రత్యేకంగా 7.6-అంగుళాల ఫోల్డింగ్ డిస్‌ప్లే తయారుచేస్తున్నట్లు సమాచారం. ఇది గెలాక్సీ జెడ్ సిరీస్‌ పోల్డింగ్ ఫోన్ డిస్‌ప్లే తరహాలో ఉంటుందని తెలుస్తోంది.

samsung-developing-folding-display-for-google-xiaomi-and-oppo
గెలాక్సీ జెడ్ ఫోల్డ్‌ 2

ఫోల్డింగ్​ డిస్​ప్లే ఫోన్

గూగుల్‌తో పాటు ఒప్పో, షావోమి కంపెనీలకు కూడా శాంసంగ్ ఫోల్డింగ్ డిస్‌ప్లేను తయారుచేస్తుందట. ఒప్పో ఫోల్డింగ్ డిస్‌ప్లే పై నుంచి కింది వరకు పూర్తిగా మడతపెట్టేలా ఉంటుంది. ఇటీవలే దీనికి సంబంధించిన వీడియో టీజర్‌ను ఒప్పో విడుదల చేసింది. ఈ డిస్‌ప్లే అన్‌ఫోల్డ్ చేసినప్పుడు 7.7-అంగుళాలు, ఫోల్డ్ చేసినప్పుడు 1.5-అంగుళాలు ఉంటుంది. షావోమి ఫోల్డింగ్ డిస్‌ప్లేలో లోపలి స్క్రీన్‌ 8.03-అంగుళాలు, వెలుపలి స్క్రీన్‌ 6.38-అంగుళాలు ఉంటుందని సమాచారం.

మూడు కంపెనీల ఫోల్డింగ్ ఫోన్​లను ఈ ఏడాడి చివర్లో కానీ, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో కానీ విడుదల చేస్తారని తెలుస్తోంది.

ఇదీ చదవండి : సరికొత్త హంగులతో 'టాటా సఫారీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.