ETV Bharat / business

షియోమీకి షాక్- అగ్రస్థానానికి శాంసంగ్​ - ఆఫ్​లైన్ మార్కెట్లో శాంసంగ్ కింగ్

మొబైల్​ ఫోన్ల మార్కెట్​లో షియోమీని వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకుంది శాంసంగ్. బాయ్​కాట్​ చైనా వంటి సెంటిమెంట్​ల ప్రభావం షియోమీ విక్రయాలపై భారీగా పడటం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Samsung dethrones Xiaomi
షియోమీకి శాంసంగ్ షాక్
author img

By

Published : Aug 7, 2020, 6:30 PM IST

చైనాకు చెందిన స్టార్ట్​ ఫోన్ల తయారీ సంస్థ షియోమీకి షాకిచ్చింది దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్. భారత మొబైల్ ఫోన్ల మార్కెట్లో అగ్రస్థానంలో రారాజుగా వెలుగొందుతున్న షియోమీని.. శాంసంగ్ వెనక్కి నెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్​ మధ్య మొబైల్​ ఫోన్ల విక్రయాలకు సంబంధించి ఇంటర్నేషనల్​ డేటా కార్పొరేషన్(ఐడీసీ) ఇండియా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

ఈ నివేదిక ముఖ్యాశాలు..

  • జూన్​తో ముగిసిన త్రైమాసికంలో మొబైల్​ ఫోన్ మార్కెట్​లో 24 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుని అగ్రస్థానానికి చేరింది శాంసంగ్. షియోమీ, వివో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • స్మార్ట్​ఫోన్ల ఆఫ్​లైన్ విక్రయాల్లో 29.1 శాతం మార్కెట్ వాటాతో 2020 రెండో త్రైమాసికంలో అగ్రస్థానంలో నిలిచింది శాంసంగ్. ఆన్​లైన్​ విక్రయాల పంరంగా మాత్రం 22.8 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
  • కేవలం స్మార్ట్​ఫోన్ల సెగ్మెంట్​లోనూ వివోను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరగలిగింది శాంసంగ్.
  • దేశవ్యాప్తంగా అత్యధిగంగా అమ్ముడైన టాప్ 5 మోడళ్లలో శాంసంగ్​ గెలాక్సీ ఎం21 కూడా ఒకటి.
  • టాప్​ 5 మోడళ్లలో నాలుగు షిమీమోకి చెందినవే. అందులో రెడ్​మీ నోట్​ 8ఏ డ్యుయల్, నోట్​ 9 ప్రో, రెడ్​మీ 8 ఉన్నాయి.

ఇదీ చూడండి:100 బిలియన్​ డాలర్ల క్లబ్​లో మార్క్​ జుకర్​బర్గ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.