ETV Bharat / business

భారత్​లో స్పుత్నిక్​ వీ టీకాల ఉత్పత్తి ప్రారంభం - భారత్​లో స్పుత్నిక్​ వీ వ్యాక్సిన్

భారత్​లో స్పుత్నిక్​ వీ టీకాల ఉత్పత్తి ప్రారంభించినట్లు ఆర్​డీఐఎఫ్​, పనాసియా బయోటెక్​ సంస్థలు వెల్లడించాయి. త్వరలోనే పూర్తిస్థాయిలో చేపట్టి.. ఏడాదికి 10 కోట్ల చొప్పున డోసులను ఉత్పత్తి చేస్తామని స్పష్టం చేశాయి.

స్పుత్నిక్​ వీ టీకా, sputnik v doses manufacture
స్పుత్నిక్​ వీ టీకా
author img

By

Published : May 24, 2021, 3:47 PM IST

Updated : May 24, 2021, 4:20 PM IST

భారత్​లో స్పుత్నిక్​ వీ టీకా ఉత్పత్తిని ప్రారంభించినట్లు రష్యన్​ డైరక్ట్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్ (ఆర్​డీఐఎఫ్​)​, పనాసియా బయోటెక్​ సంస్థలు సోమవారం సంయుక్త ప్రకటన చేశాయి. త్వరలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరుగుతుందని పేర్కొన్నాయి. హిమాచల్​ ప్రదేశ్​లోని పనాసియా బయెటెక్​ కేంద్రంలో ఉత్పత్తి అయ్యే మొదటి విడత టీకాలను నాణ్యతా ప్రమాణాల పరీక్షల నిమిత్తం రష్యాలోని గమలేయా సెంటర్​కు తరలించనున్నారు.

గత నెలలో ప్రకటించిన విధంగానే స్పుత్నిక్​ డోసులు ఏడాదికి 10 కోట్ల చొప్పున ఉత్పత్తి చేస్తామని సంస్థలు పేర్కొన్నాయి. వ్యాక్సిన్​ను ప్రస్తుతం దేశంలో పంపిణీ చేస్తామని ఆ తర్వాత విదేశాలకు కూడా సరఫరా చేస్తామని పనాసియా బయెటెక్​ ఎండీ రాజేశ్​ జైన్​ వెల్లడించారు.

ఇదీ చదవండి : ఈ కంపెనీల నిమిషం సంపాదన ఎంతో తెలుసా?

Last Updated : May 24, 2021, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.