ETV Bharat / business

ఉక్రెయిన్​పై యుద్ధ మేఘాలు... మనపై ప్రభావమెంత? - ఇండియా ఉక్రెయిన్

Ukraine war effect on India: రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకోవడం ఆందోళకరంగా మారింది. ఈ పరిణామాలు ప్రపంచ దేశాలపై తప్పక ప్రభావం చూపుతాయి. మనదేశం కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఉక్రెయిన్​కు భారత్ ఔషధాలు ఎగుమతి చేస్తూ.. వంట నునెలను అధికంగా దిగుమతి చేసుకుంటోంది. వీటితో పాటు ఉక్రెయిన్‌తో భారత్​కు అనేక ద్యైపాక్షిక వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. అవేంటంటే?

ukraine-war-effect-on-india
ukraine-war-effect-on-india
author img

By

Published : Feb 23, 2022, 6:56 AM IST

Ukraine war effect on India: కొవిడ్‌-19 మూడు దశల పరిణామాల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఇంకా పూర్తిగా కోలుకోనేలేదు. రష్యా- ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల రూపంలో మరో ముప్పు ఆందోళన పెంచుతోంది. ఆ దేశంతో వాణిజ్య పరంగా ప్రత్యక్ష ప్రభావం కంటే.. యుద్ధం వస్తే వివిధ దేశాలపై భద్రతాపరంగాను, ఆర్థికంగాను ప్రతికూల ప్రభావం పడొచ్చు. ముఖ్యంగా చమురు రవాణాకు ఆటంకాలు ఎదురవుతాయనే ఆందోళనలున్నాయి. ఇప్పటికే ముడిచమురు బ్యారెల్‌ ధర ఏడేళ్ల గరిష్ఠమైన 97 డాలర్లకు చేరడం, దిగుమతులపైనే అధికంగా ఆధారపడిన భారత్‌ వంటి దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ఇందువల్ల పెరిగే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు తీసుకుంటున్న చర్యలతో, స్టాక్‌మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు నెలకొంటున్నాయి. ఉక్రెయిన్‌తో వాణిజ్య సంబంధాలున్న దేశాలకూ కొంత ఇబ్బందికరమే. మనదేశం కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఉక్రెయిన్‌తో మన ద్యైపాక్షిక వాణిజ్య సంబంధాలు ఏమిటంటే.

Russia Ukraine war

ఔషధాలు వాళ్లకు..

India Ukraine exports imports

ఉక్రెయిన్‌కు భారత్‌ నుంచి ఎగుమతి అయ్యే వాటిల్లో ఔషధాలదే సింహభాగం. విలువపరంగా ఉక్రెయిన్‌కు ఔషధాలను అత్యధికంగా ఎగుమతి చేసే దేశాల్లో భారత్‌ మూడోది. జర్మనీ, ఫ్రాన్స్‌లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

Indian economy Russia Ukraine

  • ర్యాన్‌బాక్సీ, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, సన్‌ గ్రూపు తదితర భారత కంపెనీలకు ఉక్రెయిన్‌లో కార్యాలయాలున్నాయి. ఈ కంపెనీలు అక్కడ ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ మ్యాన్‌ఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ను (ఐపీఎంఏ) కూడా ఏర్పాటు చేసుకున్నాయి.
  • రియాక్టర్లు/ బాయిలర్‌ యంత్రాలు, మెకానికల్‌ సామగ్రి, నూనె గింజలు, పండ్లు, కాఫీ, తేయాకు లాంటి వాటినీ ఉక్రెయిన్‌కు భారత్‌ ప్రధానంగా ఎగుమతి చేస్తోంది.

సన్‌ఫ్లవర్‌ నూనె మనకు..

మన దేశానికి పొద్దుతిరుగుడు పువ్వు (సన్‌ ఫ్లవర్‌) నూనెను ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఉక్రెయిన్‌ ఒకటి. రసాయనాలు, ఇనుము, ఉక్కు, ప్లాస్టిక్‌ లాంటివి కూడా ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు చేరుతున్నాయి.

ఆసియా పసిఫిక్‌లో భారతే ముఖ్యం..

ఉక్రెయిన్‌కు ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అతిపెద్ద ఎగుమతి కేంద్రంగా భారత్‌ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్‌కు ఎగుమతులపరంగా భారత్‌ అయిదో ప్రధాన దేశమని అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది. అందువల్ల తాజా ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాలిస్తే ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్యంపైనా ప్రభావం పడొచ్చు.

అంకెల్లో చెప్పాలంటే..

2019-20లో ఉక్రెయిన్‌తో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 2.52 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.19,000 కోట్లు)గా నమోదైంది. 2015-16లోని 2.01 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 25 శాతానికి పైగా పెరిగింది. అయితే టర్నోవరు మాత్రం 2018-19లోని 2.73 బిలియన్‌ డాలర్ల నుంచి 7.59 శాతం తగ్గింది.

స్టాక్‌ మార్కెట్లపై..

రష్యా- ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల ప్రభావంతో కొన్ని రోజులుగా స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతూ నష్టపోతున్నాయి. ఉక్రెయిన్‌ సహా ఐరోపా కూటమి దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ కంపెనీల షేర్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. యుద్ధం వస్తే ఆ కంపెనీల వ్యాపారాలపై ప్రభావం పడొచ్చని మదుపర్లు ఆందోళన చెందుతుండమే ఇందుకు కారణం.

ఇదీ చదవండి: రష్యాలోని ప్రముఖ బ్యాంకులపై అమెరికా ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.