ETV Bharat / business

'జీఎస్​టీని పనికిమాలిన చట్టంగా మార్చారు' - RIP GST; BJP converted it into bad law: Chidambaram

జీఎస్​టీ చట్టం వెనుక ఉన్న మంచి ఉద్దేశాన్ని భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాలరాసిందన్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం. జీఎస్​టీ కౌన్సిల్‌ మాటలకే పరిమితమితమైందని మండిపడ్డారు.

p.Chidambaram
పి.చిదంబరం
author img

By

Published : Jun 2, 2021, 3:34 PM IST

కేంద్ర, వస్తు సేవల పన్ను చట్టం(జీఎస్​టీ)ని పనికిమాలిన చట్టంగా భాజపా మార్చేసిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబంరం. జీఎస్​టీ చట్టం అమలు వెనుక ఉన్న మంచి ఉద్దేశాన్ని కేంద్ర ప్రభుత్వం కాలరాసిందని మండిపడ్డారు.

"జీఎస్​టీ చట్టం అమలు వెనుక మంచి ఆలోచన, ఉద్దేశాలు ఉన్నాయి. భయంకరమైన పన్ను రేట్లు విధిస్తూ భాజపా దీనిని వృథా చట్టంగా మార్చింది. పన్ను వసూలు చేసే అధికారులు చాలా క్రూరంగా తయారయ్యారు. జీఎస్​టీ ఇంప్లిమెంటేషన్ కమిటీ బలహీనంగా మారింది. వ్యాపారవేత్తలను పన్ను ఎగవేతదారులుగా అనుమానిస్తున్నారు. కేంద్ర మంత్రుల బృందాన్ని ఆర్థిక మంత్రి ఎన్డీఏ కూటమి సభ్యులుగా భావిస్తున్నారు. ఇక జీఎస్​టీ కౌన్సిల్‌ మాటలకే పరిమితమితమైంది."

-చిదంబరం

గత కొద్ది రోజులుగా.. కొవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు టీకాలు, ఔషధాలు సహా ఇతర వైద్య పరికరాలపై జీఎస్​టీని మినహాయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

ఇవీ చదవండి: వాటిపై జీఎస్​టీ మినహాయింపునకు కేంద్ర బృందం ఏర్పాటు!

'వ్యాక్సిన్లపై పన్ను రేట్లు యథాతథం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.