ETV Bharat / business

Reliance buys Mandarin Oriental: రిలయన్స్‌ చేతికి న్యూయార్క్‌ హోటల్‌ - రిలయన్స్​ కొనుగోళ్లు

అమెరికాలోని అత్యంత విలాసవంతమైన ఓ హోటల్‌లో మెజారిటీ వాటాను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సొంతం చేసుకుంది. 'మాండరిన్‌ ఓరియంటల్‌ న్యూయార్క్‌' హోటల్‌లో 73.37 శాతం వాటా కొనుగోలు చేయడానికి రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ హోల్డింగ్స్‌(ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌) సంతకాలు చేసినట్లు తెలిపింది.

Reliance buys Mandarin Oriental
Reliance buys Mandarin Oriental
author img

By

Published : Jan 9, 2022, 7:33 AM IST

Reliance buys Mandarin Oriental: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెంచుతోంది. ఇప్పటికే ఈఐహెచ్‌ లిమిటెడ్‌, స్టోక్‌ పార్క్‌ లిమిటెడ్‌(బ్రిటన్‌)లలో పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థ తాజాగా తన పూర్తి స్థాయి అనుబంధ కంపెనీ ద్వారా అమెరికా (న్యూయార్క్‌)లోని అత్యంత విలాసవంతమైన ఒక హోటల్‌లో మెజారిటీ వాటా సొంతం చేసుకుంది. 'మాండరిన్‌ ఓరియంటల్‌ న్యూయార్క్‌' హోటల్‌లో 73.37 శాతం వాటా కొనుగోలు చేయడానికి రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ హోల్డింగ్స్‌(ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌) సంతకాలు చేసినట్లు శనివారం వెల్లడించింది.

Reliance buys Mandarin Oriental
మాండరిన్‌ ఓరియంటల్‌ హోటల్‌, న్యూయార్క్‌

ఈ ఒప్పందం కింద ఆ హోటల్‌లో 73.37 శాతం వాటాను పరోక్షంగా కలిగి ఉన్న కొలంబస్‌ సెంటర్‌ కార్పొరేషన్‌(కేమాన్‌) నుంచి మొత్తం జారీ చేసిన షేరు మూలధనాన్ని ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌ కొనుగోలు చేస్తుంది. ఇందుకు 98.15 మిలియన్‌ డాలర (దాదాపు రూ.736 కోట్లు)ను వెచ్చించనుంది. 'మార్చి 2022 చివరికి ఈ లావాదేవీ పూర్తవుతుందని అంచనా. నియంత్రణ సంస్థల అనుమతులు ఆలోపు లభించొచ్చ'ని ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో వెల్లడించింది.

2003లో ఏర్పాటైన మాండరిన్‌ ఓరియంటల్‌ న్యూయార్క్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. పలు అవార్డులను ఇది సొంతం చేసుకుంది కూడా. ఒకవేళ ఈ హోటల్‌లోని ఇతర పెట్టుబడిదారులు కూడా తమ వాటా విక్రయిస్తే, ప్రస్తుత ధరకు అనుగుణంగానే కొనుగోలు చేస్తామని ఆర్‌ఐఎల్‌ వెల్లడించింది.

ఇదీ చదవండి: క్విక్‌ కామర్స్‌లోకి రిలయన్స్‌ ఎంట్రీ- డుంజోలో 25.8% వాటా సొంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.