ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని పేద దేశాలతో పోలిస్తే కరోనా వైరస్ సంక్షోభం ప్రభావం నుంచి ధనిక దేశాలు వేగంగా కోలుకునే అవకాశం ఉందని ఏడీబీ, యూఎన్‌డీపీ, యూఎన్‌ఈఎస్‌సీఏపీ సంయుక్త నివేదిక అభిప్రాయపడింది. రోగ నిరోధక స్థాయి, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, వ్యాక్సిన్ అందజేత వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొంది.
కొన్ని దేశాలు, వర్గాలు ఇతర దేశాలతో పోలిస్తే వేగంగా పుంజుకోవడాన్ని కే-ఆకృతి రికవరీగా పరిగణిస్తున్నారు. కొవిడ్ సంక్షోభం మునుపటి స్థాయిలో ఆదాయాలకు చేరాలంటే ఎక్కువ దేశాలకు ఏళ్ల సమయం పడుతుందని నివేదిక అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ప్రకటించిన ఉద్దీపన చర్యలను ముందస్తుగా వెనక్కి తీసుకోరాదని పేర్కొంది. పలు వర్గాలకు ఆదాయ తోడ్పాటు, వేతన రాయితీలు, పన్ను చెల్లింపు వాయిదాలు, మారటోరియం వంటి చర్యలు చేపట్టాలని కోరింది.
1995-2015 మధ్య పలు ప్రాంతాల్లో ఆదాయ సమానత్వం తగ్గగా, ఆసియా-పసిఫిక్‌లో 5 శాతానికి పైగా పెరిగిందని గుర్తుచేసింది.
ఇదీ చదవండి : కొవాగ్జిన్ షెల్ఫ్ లైఫ్ పెంచుతారా?