ETV Bharat / business

ప్రత్యేక పరిస్థితుల నడుమ పండుగ సీజన్ విక్రయాలకు రెడీ

త్వరలో దేశంలో పండుగ సీజన్‌ ప్రారంభమవుతోంది. సాధారణంగా పండుగ సీజన్లలో కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి. అయితే ప్రస్తుత పండుగ సీజన్‌ ప్రత్యేక పరిస్థితుల్లో వస్తోంది. మరి ఈ సారి సీజన్ ఎలా ఉండబోతోంది? పండుగ సీజన్ విక్రయాలపై వ్యాపారులు ఎలాంటి అంచనాలు పెట్టుకున్నారు? రిటైలర్లు ఎలాంటి ఆఫర్లు ఇవ్వనున్నారు?

Retailers Ready for Festive sales
పండుగ సీజన్ సేల్స్​కు సర్వం సిద్ధం
author img

By

Published : Oct 9, 2020, 8:12 AM IST

దసరా, దీపావళి.. మన దేశంలో ప్రధాన పండుగ సీజన్‌ ఇదే. ఈ సమయంలో ప్రజలు ఎక్కువ కొనుగోళ్లు జరుపుతుంటారు. బట్టల నుంచి మొదలుకుని ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల వరకు ఈ సమయంలో కొనుగోలు చేసేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు.

ప్రత్యేక పరిస్థితులు..

ఈ సారి పండుగ సీజన్ ప్రత్యేక పరిస్థితుల మధ్య వస్తోంది. కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో చాలా రోజులు దుకాణాలు ముతబడ్డాయి. లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత కూడా భవిష్యత్తుపై ఆ ఆందోళనలు పోలేదు.

కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం, వేతనాల్లో కోతలను చాలా మంది ఎదుర్కొన్నారు. దీనితో గత కొంత కాలంగా ప్రజలు నిత్యావసరాలు మినహా మిగతా వస్తువుల కొనుగోళ్లు చాలా వరకు ఆపేశారు. దీనితో అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వేసవి కాలం లాంటి ప్రధాన షాపింగ్​ సీజన్‌ను కంపెనీలు, వ్యాపార సంస్థలు కోల్పోయాయి.

అయితే కొన్ని వారాలుగా పరిస్థితి మెరుగుపడుతోంది. ఆర్థిక కార్యకలాపాలు గాడిన పడుతుండటం వల్ల మార్కెట్‌లో క్రయవిక్రయాలు పెరిగాయి. ఉపాధి అవకాశాలు కూడా మళ్లీ సాధారణ స్థితికి చేరుతున్నాయి.

పండుగ సీజన్​తో పుంజుకుంటాం..

వినియోగదారులకు కొంత విరామం రావడం, పండుగ ఆఫర్ల వల్ల.. విక్రయాల్లో మంచి వృద్ధి సాధిస్తామని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత మార్కెట్‌ సాధారణం కంటే 60 శాతం తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే.. ప్రస్తుతం మార్కెట్ 30 శాతం ప్రతికూల వృద్ధిలో ఉంది. ఈ పండుగ సీజన్​లో వీటన్నింటిని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

"పండుగ సందర్భంగా మంచి స్థాయిలో వృద్ధిని ఊహిస్తున్నాం. గత ఆరు నెలల నుంచి ప్రజలు కొనుగోళ్లు జరపటం లేదు కాబట్టి మంచి స్థాయిలో మార్కెట్‌ ఉంటుందని అనుకుంటున్నాం. గతేడాది కంటే ఈ పండుగ సందర్భంగా ఎక్కువ మార్కెట్‌ జరుగుతుందని అంచనా వేస్తున్నాం. కానీ వాస్తవంగా ఎలా ఉంటుందో చూడాలి"

- మురళీకృష్ట, స్టోర్‌ మేనేజర్‌, సోనోవిజన్‌, పంజాగుట్ట

పెరిగిన ఉద్యోగాలు..

లాక్‌డౌన్​లో చాలా మంది ఉపాధి కోల్పోయారు. లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత పరిస్థితులు కాస్త మెరుగపడుతున్నాయి. గణాంకాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. మేలో 23.5 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. సెప్టెంబర్‌ మూడో వారానికి 6.4 శాతానికి తగ్గినట్లు తెలిసింది.

పండుగ సందర్భంగా వివిధ రంగాల్లో తాత్కాలిక ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ లాంటి ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలు ఇప్పటికే భారీ స్థాయిలో తాత్కాలిక ఉద్యోగాలు ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఈ కారణాలన్నీ పండుగ సీజన్​లో డిమాండ్ పెంచేందుకు దోహదపడతాయని వ్యాపారులు చెబుతున్నారు.

ఆఫర్లతో సిద్ధమైన కంపెనీలు..

పండుగలను దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమయ్యాయి. ఈ- కామర్స్‌ సంస్థలు ఫ్లిప్​కార్ట్, అమెజాన్​లు ఇప్పటికే భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.