వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) మరోసారి భారీగా పెరిగింది. మార్చిలో సీపీఐ 5.52 శాతంగా నమోదైనట్లు కేంద్ర గణాంక కార్యాలయం(ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించింది. 2021 ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.03 శాతంగా ఉన్నట్లు తెలిపింది.
ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరగడం వల్లే సీపీఐ ఎగబాకిందని ఎన్‌ఎస్‌ఓ తెలిపింది. ఫిబ్రవరిలో 3.87శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం.. మార్చిలో 4.94శాతానికి చేరిందని వివరించింది. ఇంధన ద్రవ్యోల్బణం మార్చిలో 4.5 శాతానికి పెరిగింది. ఫిబ్రవరిలో ఇది 3.53 శాతంగా ఉంది.
2020-21 జనవరి-మార్చి త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాలలో 5.2 శాతంగా ఉండొచ్చని తెలిపింది.
అంతంత మాత్రంగా పారిశ్రామికోత్పత్తి..
ఈ ఏడాది ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 3.6 శాతం క్షీణించింది. గతేడాది ఫిబ్రవరిలో ఐఐపీ 5.2 శాతం పెరగడం గమనార్హం.
కేంద్ర గణాంకాల కార్యాలయం(ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన దాని ప్రకారం ప్రకారం.. ఫిబ్రవరిలో విద్యుత్ రంగం 0.1శాతం వృద్ధిని సాధించగా, గనుల రంగంలో 5.5 శాతం తగ్గదల నమోదైంది.
ఇదీ చూడండి: పెరిగిన టోకు ద్రవ్యోల్బణం- ఫిబ్రవరిలో 4.17%