ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనో భారతదేశ విపణిలో పలు మోడళ్లపై బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ప్రారంభ స్థాయి మోడల్ క్విడ్ నుంచి.. రెనోలో విజయవంతమైన డస్టర్ వరకు సరికొత్త డిస్కౌంట్లను ప్రకటించింది. ఏప్రిల్ నెలలో ఇవి అందుబాటులో ఉంటాయని 'రెనో ఇండియా' ప్రకటించింది. వినియోగదారులకు గరిష్ఠంగా రూ.75,000 వరకు ప్రయోజనాలు కల్పించనున్నట్లు తెలిపింది.
ఈ కంపెనీ ప్రస్తుతం ట్రైబర్, క్విడ్, డస్టర్ మోడళ్లను అందిస్తోంది.
క్విడ్: రూ.50,000
క్విడ్ కారు కొనే వినియోగదారులకు రూ.50 వేల వరకు గరిష్ఠ ప్రయోజనాలను కల్పించనుంది రెనో.
ఎక్సేంజ్ ఆఫర్ నగదు ప్రయోజనాలు:
- 2020 మోడల్‌పై రూ.20,000
- 2021 మోడల్‌పై రూ.10,000 వరకు
- లాయల్టీ ప్రయోజనాలు రూ.10,000
- కార్పొరేట్ డిస్కౌంట్ రూ.10,000
- గ్రామీణ వినియోగదారులకు రూ.5,000 ప్రత్యేక తగ్గింపు
ట్రైబర్: రూ.55,000
రెనో ట్రైబర్‌పై రూ.55,000 + కార్పొరేట్ డిస్కౌంట్ ప్రయోజనాలు వర్తిస్తాయని కంపెనీ మార్కెటింగ్ విభాగం తెలిపింది.
2021 మోడల్‌పై..
- రూ.20,000 వరకు ఎక్సేంజ్ ఆఫర్ ప్రయోజనం
- ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.10,000 వరకు లాయల్టీ ప్రయోజనాలు
- రూ.25,000 వరకు నగదు ప్రయోజనాలు
- రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్,
- గ్రామీణ వినియోగదారులకు ప్రత్యేక వడ్డీరేటు(6.99శాతం)
2021 మోడల్‌పై..
- రూ.20,000 వరకు ఎక్సేంజ్ ఆఫర్ ప్రయోజనం
- ఎంపిక చేసిన మోడళ్లపై రూ.10,000 వరకు లాయల్టీ ప్రయోజనాలు
- రూ.15,000 వరకు నగదు ప్రయోజనాలు
- రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ లేదా గ్రామీణ వినియోగదారులకు రూ.5,000 ప్రత్యేక ఆఫర్‌తో పాటు 6.99 వడ్డీ రేటు కల్పించనుంది.
డస్టర్‌పై ఇలా..
- రెనోలో డస్టర్ 1.5లీటర్ వేరియంట్‌పై రూ.45,000 + కార్పొరేట్ డిస్కౌంట్ ప్రయోజనాలు అందివ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
- ఆర్ఎక్స్ఎస్, ఆర్ఎక్స్జడ్ వేరియంట్లపై రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనం
- రూ.15,000 వరకు లాయల్టీ ప్రయోజనాలు
- రూ.30,000 కార్పొరేట్ డిస్కౌంట్ లేదా గ్రామీణ వినియోగదారులకు రూ.15,000 ప్రత్యేక ఆఫర్
డస్టర్ 1.3లీటర్..
- రెనో డస్టర్ 1.3లీటర్ వేరియంట్‌పై రూ.75,000 + కార్పొరేట్ డిస్కౌంట్ ప్రయోజనాలు అందివ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. వీటిలో..
- ఆర్ఎక్స్ఎస్, ఆర్ఎక్స్జడ్ వేరియంట్లపై రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనం..
- రూ.15,000 వరకు లాయల్టీ ప్రయోజనాలు, ఆర్ఎక్స్ఈ వేరియంట్‌కు రూ.20,000
- ఆర్ఎక్స్ఎస్-సీవీటీ, ఎమ్టీ వేరియంట్లపై మాత్రం రూ.30,000 వరకు నగదు ప్రయోజనాలు
- రూ.30,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ లేదా గ్రామీణ వినియోగదారులకు రూ.15,000 ప్రత్యేక ఆఫర్
పైన పేర్కొన్న ఆఫర్లన్నీ 2021 ఏప్రిల్ 30 వరకు, ఎంపిక చేసిన మోడళ్లపై మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. మరిన్ని వివరాల కోసం సమీపంలో ఉన్న రెనో షోరూమ్‌ను సంప్రదించాల్సిందిగా సూచించింది.
ఇవీ చదవండి: దివ్యాంగులకు జీఎస్‌టీ తగ్గింపు: రెనో