ETV Bharat / business

'బెస్ట్​ ఎంప్లాయర్'​గా రిలయన్స్​.. ఆ జాబితాలో అగ్రస్థానం - ఫోర్బ్స్​

ఫోర్బ్స్​ విడుదల చేసిన వరల్డ్​ బెస్ట్​ ఎంప్లాయర్​ ర్యాంకింగ్స్​లో రిలయన్స్ ఇండస్ట్రీస్​ (reliance news today)​ 52వ స్థానాన్ని దక్కించుకుంది(forbes reliance). భారత సంస్థల్లో మాత్రం రిలయన్స్​దే అగ్రస్థానం. 58దేశాల్లో ఎం​ఎన్​సీలకు పనిచేస్తున్న 1.5లక్షల మంది పూర్తిస్థాయి, పార్ట్​టైమ్​ ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారు(forbes news today).

reliance news
రిలయన్స్​
author img

By

Published : Oct 14, 2021, 3:32 PM IST

Updated : Oct 14, 2021, 3:48 PM IST

దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్​ ఇండస్ట్రీస్​ మరో ఘనత సాధించింది(forbes reliance). ఆదాయం, లాభాలు, మార్కెట్​ విలువలో దూసుకుపోతున్న రిలయన్స్​.. ఫోర్బ్స్​ విడుదల చేసిన 2021 వరల్డ్​ బెస్ట్​ ఎంప్లాయర్​ ర్యాంకింగ్స్​లోని(world's best employers 2021).. భారత సంస్థల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో 52వ స్థానాన్ని దక్కించుకుంది(reliance news today).

58దేశాల్లో ఎం​ఎన్​సీలకు పనిచేస్తున్న 1.5లక్షల మంది పూర్తిస్థాయి, పార్ట్​టైమ్​ ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్న వారి వివరాలు గోప్యంగా ఉంటాయని ఫోర్బ్స్​ హామీనివ్వడం వల్ల స్వేచ్ఛగా రేటింగ్స్​ ఇచ్చే అవకాశం వారికి దక్కింది. లింగ సమానత్వం, సామాజిక బాధ్యతలు, ప్రతిభను అభివృద్ధి చేయడం, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ప్రశ్నలపై సర్వే జరిగింది.

దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్​ ఎలక్ట్రానిక్స్​ మొదటి స్థానంలో నిలిచింది. అమెరికా సంస్థలు ఏబీఎమ్​, మైక్రోసాఫ్ట్​, అమెజాన్​, యాపిల్​, ఆల్ఫాబెట్​, డెల్​లు తర్వాతి స్థానాలు కైవసం చేసుకున్నాయి.

దేశీయ సంస్థలు.. ర్యాంకులు..

సంస్థర్యాంకు
రిలయన్స్52
ఐసీఐసీఐ బ్యాంక్​ 65
హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ 77
హెచ్​సీఎల్​ టెక్నాలజీస్​ 90
ఎస్​బీఐకి 119
ఎల్​ అండ్​ టీ 127
బజాజ్​ 215
యాక్సిస్​ బ్యాంక్​ 254
ఇండియన్​ బ్యాంక్​ 314
ఓఎన్​జీసీ 404
అమర్​ రాజా గ్రూప్405
కోటక్​ మహీంద్రా బ్యాంక్​ 418
బ్యాంక్​ ఆఫ్​ ఇండియా 451
ఐటీసీ 453
సిప్లా 460
బ్యాంక్​ ఆఫ్​ బరోడా 496
ఎల్​ఐసీ 504
ఇన్ఫోసిస్​ ​ 588
టాటా గ్రూప్​ 746

ఇవీ చూడండి:-

Last Updated : Oct 14, 2021, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.