ETV Bharat / business

రిలయన్స్ కొత్త వ్యాపారం- ఈసారి మహిళల కోసం... - అవంత్ర బై ట్రెండ్స్ స్టోర్​

రిలయన్స్​ రిటైల్(Reliance retail)​ సంస్థ.. మహిళల కోసం ప్రత్యేక డిజైన్లలో దుస్తులు లభించే ఓ స్టోర్​ను బెంగళూరులో ప్రారంభించింది. 'అవంత్ర బై ట్రెండ్స్'(Avantra Trends)​ పేరుతో దీన్ని ఏర్పాటు చేసింది.

Avantra Trends
అవంత్ర బై ట్రెండ్స్
author img

By

Published : Sep 9, 2021, 3:11 PM IST

ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్​ రిటైల్(Reliance Retail) మహిళల కోసం ఓ ప్రత్యేకమైన సదుపాయాన్ని తీసుకువచ్చింది. 'అవంత్ర బై ట్రెండ్స్'​(Avantra Trends)​ పేరుతో మహిళల చీరలు, సంప్రదాయ దుస్తులు లభించే ఓ స్టోర్​ను బెంగళూరులో ప్రారంభించింది. 9,500 చదరపు అడుగుల స్థలంలో ఈ స్టోర్​ను ఏర్పాటు చేసినట్లు రిలయన్స్ సంస్థ తెలిపింది.

"భారతీయ సంప్రదాయం, సంస్కృతికి వన్నె తెచ్చేలా.. 25 నుంచి 40 ఏళ్ల మహిళల కోసం 'అవంత్ర బై ట్రెండ్స్'​ పేరుతో సరికొత్త డిజెన్లను అందుబాటులోకి తీసుకువచ్చాం." అని రిలయన్స్​ పేర్కొంది. 80 మందికిపైగా చేనేతలు, డిజైనర్లు, ప్రఖ్యాత మాస్టర్ క్రాఫ్ట్​మెన్​ 'అవంత్ర బై ట్రెండ్స్' కోసం పనిచేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి దక్షిణాదిలోని వివిధ నగరాల్లో మరో 30 స్టోర్​లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది.

ఇదీ చూడండి: ఉద్యోగంలో గ్యాప్​ వచ్చిందా.. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మీకోసమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.