ETV Bharat / business

jio tariff hike: జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్- ప్రీపెయిడ్ ఛార్జీలు పెంపు - జియో ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు పెంపు

jio tariff hike: ఎయిర్​టెల్​, వోడాఫోన్​ బాటలోనే నడిచింది రిలయన్స్ జియో. తాము కూడా ప్రీపెయిడ్​ ప్లాన్​ల ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే..

Reliance Jio Announces Prepaid Tariff Hike After Airtel, Vi
రిలయన్స్​ జియో
author img

By

Published : Nov 28, 2021, 7:53 PM IST

Updated : Nov 28, 2021, 8:58 PM IST

jio tariff hike: ప్రీపెయిడ్ ఛార్జీ​లపై రిలయన్స్​ జియో కీలక నిర్ణయం తీసుకుంది. టారిఫ్​లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఒక్కో ప్లాన్​ ధరను 19.6 నుంచి 21.3శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది రిలయన్స్ జియో. ఈ ధరలు డిసెంబర్ 1న అమలులోకి రానున్నాయి.

  • ప్రస్తుతం రూ.75 ఉన్న జియోఫోన్​ ప్లాన్ రూ.91కి పెరగనుంది. ​3జీబీ డేటా, అన్​లిమిటెడ్ వాయిస్ కాల్స్​, 50 ఎస్​ఎమ్​ఎస్​లు రానున్నాయి.
  • అన్​లిమిటెడ్​ ప్లాన్ రూ.129.. రూ.155కు చేరనుంది. ఈ ప్లాన్​లో 2 జీబీ నెలవారీ డేటా, అన్​లిమిటెడ్​ వాయిస్ కాలింగ్, 300 ఎస్​ఎమ్​ఎస్​లు ఉంటాయి.
  • రూ.555 ప్రీపెయిడ్​ ప్లాన్ కాస్త.. రూ.666కి చేరుకుంటుంది. రూ.599 ప్లాన్ 719కి పెరగనుంది.
  • రూ.2,399కి వచ్చే ఏడాది ప్రీపెయిడ్ ప్లాన్.. పెరిగిన ధరల ప్రకారం రూ.2,897కి చేరుకుంటుంది.

పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్​లు ఇలా..

jio tariff hike
పెరిగిన జియో ఛార్జీలు ఇలా..

పెరిగిన ఎయిర్​టెల్ ధరలు..

టెలికాం దిగ్గజం ఎయిర్​టెల్(airtel recharge)..​ ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచుతునున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్​, అన్​లిమిటెడ్ వాయిస్ ప్యాక్​లు, మొబైల్ డేటా రీఛార్జ్​లపై ఉన్న ధరలపై 20-25 శాతం పెంచినట్లు తెలిపింది. ఎంట్రీ లెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్​ ధర 25శాతం.. అన్​లిమిటెడ్ వాయిస్ బండిల్స్ ధర 20శాతం పెంచినట్లు పేర్కొంది. కొత్త ధరలు నవంబరు 26 నుంచి అమల్లోకి రానున్నట్లు వివరించింది.

నూతన ధరలు.. దేశంలో 5జీ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడతాయని ఎయిర్​టెల్​ పేర్కొంది. కొత్త రేట్ల ప్రకారం.. వాయిస్ ప్లాన్స్ ధర ఇంతకుముందు రూ.79 కాగా ప్రస్తుతం రూ. 99కు చేరింది. 50శాతం అధిక టాక్​టైం, 200జీబీ మొబైల్ డేటా, సెకనుకు 1పైసా వాయిస్ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ప్లాన్ గడువు 28 రోజులు ఉంది.

మొబైల్ రీఛార్జ్​ ప్లాన్స్​ ద్వారా.. ఒక్కో యూజర్ నుంచి ​ సరాసరి రెవెన్యూ(ఏఆర్​పీయూ) రూ. 200 నుంచి రూ. 300 వరకు ఎయిర్​టెల్​కు(airtel recharge) చేరుతున్నట్లు కంపెనీ తెలిపింది. అన్​లిమిటెడ్ వాయిస్ బండిల్స్, డేటా టాప్​అప్స్​పైనా రీఛార్జ్ ధరలు పెరిగినట్లు ఎయిర్​టెల్ పేర్కొంది.

వోడాఫోన్​ ఛార్జీలు పెంపు..

వొడాఫోన్​ ఐడియా (Vodafone idea) కస్టమర్లకు పెద్ద షాక్​ తగిలింది. మొబైల్​ ఛార్జీలను భారీగా పెంచుతున్నట్లు కంపెనీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

మొబైల్​ కాల్స్​, డేటా ప్లాన్లపై దాదాపు 20 నుంచి 25 శాతం మేర పెంపు ఉండనున్నట్లు స్పష్టం చేసింది. నవంబర్​ 25 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది.

28 రోజుల కనీస రీఛార్జ్​ ప్లాన్​ ధరను 25.31 శాతం పెంచింది. పాత ధర రూ. 79 ఉండగా.. ఇప్పుడు రూ. 99కి చేరింది.

అన్​లిమిటెడ్​ కేటగిరీ ప్లాన్లలో రేట్ల పెంపు 20-23 శాతం మధ్య ఉంది.

కొత్త ధరలివే..

ప్లాన్కాలపరిమితిపాత ధరకొత్త ధర​
1GB/ డే28 రోజులురూ. 219రూ. 269
1.5 GB/డే84 రోజులురూ. 599రూ. 719
1.5GB/డే365 రోజులురూ. 2399రూ. 2899

ఇదీ చదవండి:ఎయిర్​టెల్​ బాటలోనే వొడాఫోన్​ ఐడియా.. ఛార్జీలు భారీగా పెంపు

ఎయిర్​టెల్ ప్రీపెయిడ్ ఛార్జీలు పెంపు.. కొత్త ధరలివే

Last Updated : Nov 28, 2021, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.