ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Results) మరోసారి హవా కొనసాగించింది. రెండో త్రైమాసిక ఫలితాల్లో 43 శాతం వృద్ధిని నమోదు చేసింది(reliance latest news ). రూ.13,680 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సంస్థకు చెందిన అన్నీ వ్యాపారాలు బాగా సాగడం వల్ల ఈ స్థాయిలో వృద్ధి సాధించింది. ఈమేరకు జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో సంస్థ(reliance news) వెల్లడించింది.
గతేడాది ఇదే త్రామాసికంలో రిలయన్స్(reliance news today) 9,567 కోట్ల నికర లాభం గడించింది. అప్పుడు రూ.1,20,444 కోట్లుగా ఉన్న సంస్థ ఆదాయం ఈసారి రూ.1,78,328కోట్లకు చేరింది.
జియో లాభం 23.5శాతం వృద్ధి..
రెండో త్రైమాసికంలో జియో ఏకీకృత నికర లాభం 23.5 శాతం వృద్ధి చెంది రూ. 3,728కి చేరినట్లు రిలయన్స్ వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో ఈ మొత్తం రూ.3,019 కోట్లుగా ఉంది. జులై-సెప్టెంబర్ త్రైమాసిక స్థూల ఆదాయం దాదాపు 7 శాతం పెరిగి రూ. 23,222 కోట్లకు చేరింది. గత ఏడాది ఇది రూ. 21,708 కోట్లుగా ఉంది.