ETV Bharat / business

రిలయన్స్‌ డిజిటల్‌ పండగ ఆఫర్లు - samsung galaxy s90 offfers

పండగ సీజన్​లో రిలయన్స్​ డిజిటల్ సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. ''ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌'' పేరుతో వివిధ రకాల ఎలక్ట్రానిక్ పరికరాలపై ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. వచ్చే నెల 16 వరకు ఈ ఆఫర్ల సందడి కొనసాగుతుందని వివరించింది.

reliance-digital-festival-offers-on -gadgets
రిలయన్స్‌ డిజిటల్‌ పండగ ఆఫర్లు
author img

By

Published : Oct 25, 2020, 7:15 AM IST

పండుగ సమయంలో రిలయన్స్​ డిజిటల్​ సంస్థ వివిధ రకాల మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై ఆకర్షణీయమైన ఆఫర్లు, అదనపు ప్రయోజనాలనూ అందిస్తున్నట్లు తెలిపింది. 'ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌' పేరుతో ఈ ఆఫర్లు అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డెబిట్‌ కార్డ్స్‌, క్రెడిట్‌ కార్డ్స్‌ ద్వారా జరిపే కొనుగోళ్లకు 10 శాతం క్యాష్‌బ్యాక్‌ (నగదు వాపసు) సదుపాయాన్ని కల్పిస్తోంది.

రిలయన్స్‌ డిజిటల్‌ విక్రయ కేంద్రాల్లో సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌/ డెబిట్‌ కార్డ్స్‌ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.2,500 వరకు క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. ఇక తమ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో సిటీ బ్యాంక్‌ డెబిట్‌/ క్రెడిట్‌ ద్వారా కొనుగోలు చేస్తే 15% క్యాష్‌ బ్యాక్‌ పొందవచ్చని రిలయన్స్‌ డిజిటల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. నూతనంగా మార్కెట్​లోకి వచ్చిన శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌20 పైనా ఆఫర్లు అందిస్తోంది. ఇక పండగ బహుమతి కింద కొనుగోలుదార్లకు రూ.1000 వరకు విలువైన జియో, రిలయన్స్‌ ట్రెండ్‌ ఓచర్లు కూడా లభిస్తాయని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.