ETV Bharat / business

'ఛార్జీల పెంపుతోనే స్థిరమైన వృద్ధి' - ఐసీఆర్​ఏ రిపోర్టు

వినియోగదారులపై సర్వీస్​ ఛార్జీలను విధించడం వల్ల టెలికాం రంగంలో వృద్ధి కొనసాగుతుందని ఐసీఆర్​ఏ పేర్కొంది. దీంతో పరిశ్రమకు ఆదాయం పెరిగి నిలదొక్కుకునే అవకాశం ఉందని వివరించింది.

Recovery sustains in telcos' operating metrics; elevated debt levels to remain big impediment: ICRA
'ఛార్జీల పెంపుతోనే స్థిరమైన వృద్ధి'
author img

By

Published : Apr 12, 2021, 5:57 PM IST

యూజర్ల నుంచి సర్వీస్​ ఛార్జీలు వసూలు చేయడం ద్వారా టెలికాం రంగంలో స్థిరమైన వృద్ధి కొనసాగుతుందని ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ(ఐసీఆర్​ఏ) సోమవారం తెలిపింది. ఇలా చేయడం వల్ల పరిశ్రమకు ఆదాయంతో పాటు మార్జిన్ కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ పరిశ్రమ మొత్తం అప్పు రూ.5 లక్షల కోట్లుగా ఉండొచ్చని అంచనా వేసింది.

వినియోగదారులపై మరోసారి సుంకం పెంచితే వచ్చే ఆదాయం పరిశ్రమకు దన్నుగా నిలుస్తుందని పేర్కొంది ఐసీఆర్​ఏ. అయితే ఉన్న అప్పు మాత్రం అలానే కొనసాగుతుందని వెల్లడించింది. ఇటీవల ముగిసిన స్పెక్ట్రం వేలంతో సంస్థల రుణాలు మరింత పెరిగాయని తెలిపిన ఐసీఆర్​ఏ.. ఇవే పరిశ్రమ ఎదుగుదలకు అవరోధంగా మారాయని వివరించింది.

"వినియోగదారులు 2 జీ నుంచి 4జీకి అప్​గ్రేడ్​ అయ్యారు. దీంతో టెలిఫోన్​ సేవల వాడకం కూడా పెరిగింది. ఈ కారణంగా టారీఫ్​ ఛార్జి రూ. 220కు చేరింది. రాబోయే రెండేళ్లలో పరిశ్రమల ఆదాయం సంవత్సరానికి 11-13 శాతం వృద్ధి చెందుతుంది."

-సవ్యసాచి మజుందార్, ఐసీఆర్​ఏ వైస్ ప్రెసిడెంట్

పరిశ్రమలో పెరుగుదల ఉన్నప్పటికీ టెలికాం సంస్థలు ఇతర సేవలు మీద కూడా దృష్టి సారించాలని మజుందార్​ తెలిపారు. క్లౌడ్, డిజిటల్, బ్రాడ్‌బ్యాండ్ సేవలకు మరింత ఆస్కారం ఉంటుందని వివరించారు.

ఇదీ చూడండి: మండుటెండల్లో మారుతీ 'చల్లటి' ఆఫర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.