వినూత్న డిజైన్‌లతో మొబైల్ ప్రియుల్ని అలరిస్తున్న రియల్‌మీ త్వరలోనే ‘ఎక్స్9 ప్రొ’ని మార్కెట్‌లోకి తేనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 చిప్‌సెట్‌తో ముందుకొస్తోంది. ప్రైమరీ కెమెరా సామర్థ్యం 105 ఎంపీ. పంచ్-హోల్ కట్‌అవుట్‌తో కనిపించే తెర పరిమాణం 6.4 అంగుళాలు. రిజల్యూషన్ 1080x2400 పిక్సల్స్. వెనక మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 32ఎంపీ. ర్యామ్ 8జీబీ. స్టోరేజ్ సామర్థ్యం 128జీబీ. బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్. 65వాట్ ఫాస్ట్-ఛార్జింగ్ సపోర్టు ఉంది.
రియల్‌మీ 'ఎక్స్ 9ప్రొ' ధర రూ. 30వేలుగా ఉండవచ్చని అంచనా.