ETV Bharat / business

ఎన్‌హెచ్‌బీ, నాబార్డ్‌లు ఇక ప్రభుత్వానిదే!

నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌(ఎన్‌హెచ్‌బీ), నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(నాబార్డ్‌)ల పూర్తి వాటాలను రూ.1450 కోట్లు, రూ.20 కోట్లకు  ప్రభుత్వానికి విక్రయించింది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ). ఇక నుంచి ఇవి పూర్తి స్థాయి ప్రభుత్వ యాజమాన్య సంస్థలుగా మారాయి. మార్చి 19న ఎన్‌హెచ్‌బీలో,  ఫిబ్రవరి 26న నాబార్డ్‌లో తన వాటాలను విక్రయించినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎన్‌హెచ్‌బీ, నాబార్డ్‌ల 100 శాతం వాటా ప్రభుత్వానిదే!
author img

By

Published : Apr 25, 2019, 7:39 AM IST

RBI
ఎన్‌హెచ్‌బీ, నాబార్డ్‌ల 100 శాతం వాటా ప్రభుత్వానిదే!

నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు(ఎన్‌హెచ్‌బీ), నేషనల్‌ బ్యాంకు ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(నాబార్డ్‌)ల నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిష్క్రమించింది. వాటిల్లో ఉన్న మొత్తం వాటాలను వరుసగా రూ.1450 కోట్లు, రూ.20 కోట్లకు ప్రభుత్వానికి విక్రయించింది. ఆర్బీఐ నిర్ణయంతో ఎన్​హెచ్​బీ, నాబార్డ్​లు పూర్తి స్థాయి ప్రభుత్వ యాజమాన్య సంస్థలుగా మారాయి. మార్చి 19న ఎన్‌హెచ్‌బీ, ఫిబ్రవరి 26న నాబార్డ్‌లో తన వాటాలను విక్రయించినట్లు ఆర్‌బీఐ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పెట్టుబడుల విక్రయంతో ఈ రెండు ఆర్థిక సంస్థల్లో ప్రభుత్వ వాటా 100 శాతానికి చేరిందని తెలిపింది.

అక్టోబరు 2001లో నరసింహం కమిటీ ఇచ్చిన నివేదికతో పాటు, ఆర్‌బీఐ సొంత చర్చా పత్రమైన ‘హార్మనైజింగ్‌ ద రోల్‌ అండ్‌ ఆపరేషన్స్‌ ఆఫ్‌ డెవలపమ్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అండ్‌ బ్యాంక్స్‌’ సిఫారసుల అమలులో భాగంగానే ఈ పరిణామం జరిగింది.

నాబార్డ్‌లో పెట్టుబడుల ఉపసంహరణ రెండు దశల్లో జరిగింది. నాబార్డ్‌లో ఆర్‌బీఐకి రూ.1450 కోట్ల విలువైన 72.5 శాతం వాటా ఉండగా.. అక్టోబరు 2010లో 71.5 శాతం వాటాను రూ.1430 కోట్లకు విక్రయించింది. మిగతా వాటా ఫిబ్రవరి 26, 2019లో అమ్మింది. ఇక ఎన్‌హెచ్‌బీలో ఆర్‌బీఐకి 100 శాతం వాటా ఉండగా.. ఆ మొత్తం వాటాను మార్చి 19, 2019న విక్రయించింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No stand-alone clips allowed. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Fernando Buesa Arena, Vitoria-Gasteiz, Spain. 24th April 2019.
+++SHOTLIST AND FULL STORYLINE TO FOLLOW+++
SOURCE: IMG Media
DURATION: 01:42
STORYLINE:
CSKA Moscow beat Baskonia 84-77 on the road to move 2-1 ahead after Game 3 of their EuroLeague playoff on Wednesday.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.