ETV Bharat / business

'ద్రవ్యలోటున్నా... నోట్లు ముద్రించే ఆలోచన లేదు' - ద్రవ్యలోటు

ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంతదాస్​.. పెరిగిపోతున్న ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు ద్రవ్యాన్ని (కరెన్సీ నోట్లు) ముద్రించే ఆలోచన ఏమీ లేదని స్పష్టం చేశారు. ద్రవ్య లోటు లక్ష్యాన్ని కేంద్రప్రభుత్వం వరుసగా మూడో సంవత్సరం సవరించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

RBI rules out printing more money to cover fiscal deficit
నోట్లు ముద్రించే ఆలోచన లేదు: దాస్
author img

By

Published : Feb 6, 2020, 3:42 PM IST

Updated : Feb 29, 2020, 10:07 AM IST

పెరుగుతున్న ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు కరెన్సీ నోట్లను ముద్రించే ఆలోచనేమీ లేదని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని వరుసగా మూడో సంవత్సరం సవరించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర బడ్జెట్...​ ప్రస్తుత ఆర్థిక సంవత్సర ద్రవ్యలోటు 3.8 శాతానికి పరిమితం చేస్తామని పేర్కొంది. ఇది అంతకు ముందు బడ్జెట్​లో అంచనా వేసిన 3.3 శాతాన్ని మించింది. అలాగే 2019 జులైలో అంచనా వేసిన 3 శాతం ద్రవ్యోల్బణం.. 2021 నాటికి 3.5 శాతానికి పెరగవచ్చని పేర్కొంది.

ప్రభుత్వం ఇప్పటికే ద్రవ్య లోటు పరిమితిని అధిగమించింది. డిసెంబర్ చివరి నాటికి 132 శాతం మేర ద్రవ్యలోటును కలిగి ఉంది.

ఎస్కేప్​ క్లాజ్​

ఫిస్కల్ రెస్పాన్స్​బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్​మెంట్ (ఎఫ్​ఆర్​బీఎం) చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎస్కేప్​ క్లాజ్​ను ఉపయోగించుకుంది. ఇది ఒత్తిడి సమయంలో ఆర్థిక లోటును 50 బీపీఎస్​ మేరకు సడలింపు పొందే అవకాశాన్ని కల్పించింది. దీని ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మార్కెట్​ నుంచి రూ.5.45 లక్షల కోట్ల నికర రుణం పొందడానికి మార్గం సుగమమైంది.

ఇదీ చూడండి: వడ్డీరేట్లు యథాతథం.. భవిష్యత్​ ఆందోళనకరం!

Last Updated : Feb 29, 2020, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.