RBI MPC meeting: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సమావేశాన్ని సోమవారం నుంచి ప్రారంభించనుంది. ఈ సమావేశంలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఆర్‌బీఐ కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో వడ్డీరేట్లు కొనసాగించాల్సి అవసరం ఉంటుందని చెప్తున్నారు. దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడమే లక్ష్యంగా నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు. ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎమ్‌పీసీ) తీసుకునే నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ నెల 8వ తేదీన వెల్లడిస్తారు.
'మార్కెట్లో గందరగోళం లేకుండా వడ్డీరేట్ల పెంపుదలను గతంలోలానే ఉంచుతుందని, మానిటరింగ్ పాలసీ సమావేశానికి ముందే రివర్స్ రెపో రేటు పెంపుపై చర్చలు జరగవచ్చని'ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్‌లో పేర్కొంది. అలాగే రివర్స్ రెపో రేటుపై నిర్ణయం అనేది సంక్షోభ సమయంలో మాత్రమే తీసుకునేది కాబట్టి దాని ప్రస్తావన ఇప్పుడు రాకపోవచ్చని పేర్కొంది.
కొత్త వేరియంట్ అనిశ్చితి మధ్య కీలకమైన వడ్డీరేట్లపై నిర్ణయం ప్రకటించేందుకు ఆర్‌బీఐ మరికొంత సమయం తీసుకోవచ్చని కోటక్ ఎకనామిక్ రీసెర్చ్ తెలిపింది.
TAGS: RBI MPC meeting, rbi monetary policy 2021, rbi policy rates
ఇదీ చూడండి: కొత్త సంవత్సరంలో కార్ల ధరలకు రెక్కలు!