కరోనా వైరస్ దెబ్బకి అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ సూచీలు నేలచూపులు చూస్తున్న నేపథ్యంలో, జూన్‌లోగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 65 బేసిస్ పాయింట్ల మేర కీలకరేట్లను తగ్గించొచ్చని బ్రిటిష్ సంస్థ బార్‌క్లేస్ అంచనా వేసింది. ఏప్రిల్‌లో జరగనున్న ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షకు ముందే ఒక విడత రేట్ల కోతను ప్రకటించొచ్చని భావిస్తోంది.
రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే కాస్త ఎక్కువగా ఉన్నా, వృద్ధినే ఆర్‌బీఐ ప్రధానంగా భావించవచ్చని పేర్కొంది. అయితే ద్రవ్యలభ్యత మెరుగు పడనంత వరకూ రేట్ల కోత వల్ల ప్రయోజనం పరిమితంగానే ఉండొచ్చని వివరించింది.
ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్: నష్టాల బాటలో విమానయాన రంగం